లైంగిక వేధింపులు: దర్శకుడిపై కుమార్తె కేసు

ఆమె మాట్లాడుతూ... "నేను ఏడేళ్ల వయసులో ఉండగా ఆయన నన్ను చేతుల్లో ఎత్తుకుని మా ఇంటి రెండో అంతస్తుకి తీసుకువెళ్లాడు. అక్కడంతా మసక వెలుతురు. తన పొట్టమీద నన్ను కూర్చోబెట్టుకుని మా సోదరుడి ఎలక్ట్రిక్ ట్రైన్ సెట్‌తో ఆడుకోమని చెప్పాడు. ఆ తర్వాత నాపై లైంగికంగా దాడి చేశాడు. నేను మంచి అమ్మాయిననీ, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుదామనీ, మనం పారిస్‌కి వెళ్దామనీ, తన సినిమాల్లో నన్ను స్టార్‌ని చేస్తాననీ వాగ్ధానం చేశాడు. ఇవాళ ట్రైన్ బొమ్మలను చూడాలంటేనే నాకు భయంగా ఉంటుంది'' అంది డైలాన్.
డైలాన్ తల్లి మియా ఫారో, వుడీ అలెన్ 1980 నుంచీ డేటింగ్ ప్రారంభించారు. డైలాన్‌నూ, ఆమె సోదరుడు మోజెస్‌నూ 1987లో వుడీ దత్తత తీసుకున్నాడు. ఆయన తనను లైగింక వేధింపులకు గురి చేశాడని డైలాన్ 1993లోనే కేసు పెట్టినా, తర్వాత దాన్ని ఉపసంహరించుకుంది. తన తల్లి, తోబుట్టువుల నుంచి దూరంగా తనతో పాటు వుడీ తీసుకు వెళ్లేవాడనీ, తనపై వేధింపులకు పాల్పడేవాడనీ బహిరంగ లేఖలో డైలాన్ తెలిపింది. అప్పట్లో ఇది సాధారణమే అనుకునేదాన్ననీ, తండ్రులు తమ కూతుళ్ల పట్ల ఇలాగే ఉండేవారమోనని అనుకునేదాన్ననీ ఆమె వివరించింది.


Click it and Unblock the Notifications











