For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రూస్ విల్లీస్ లేటెస్ట్ యాక్షన్ 'జి.ఐ.జో 2'

  By Srikanya
  |

  లాస్ ఏంజల్స్ : బ్రూస్ విల్లీస్, డ్వేన్ జాన్సన్ (ద రాక్) హీరోలుగా రూపుదిద్దుకున్న హాలీవుడ్ మూవీ 'జి.ఐ.జో: రిటాలియేషన్'. నాలుగేళ్ల క్రితం వచ్చిన 'జి.ఐ.జో: ది రైజ్ ఇఫ్ కోబ్రా'కు ఇది సీక్వెల్. జోన్ ఎం. చు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న ఈ చిత్రం విడుదలవుతోంది. మనదేశంలో మాత్రం రెండు రోజుల ముందుగా 27న విడుదలవుతుండటం విశేషం. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులోకి 'జి.ఐ.జో 2'గా అనువదించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో త్రీడీ, టూడీల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

  'హాస్‌బ్రో రచించిన కామిక్ కథలు 'జి.ఐ.జో' ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రాల వరుసలో ఇది రెండోవది. ప్రపంచ నేతలంతా కోబ్రా కంట్రోల్‌లోకి వెళ్లిపోవడంతో వారిని రక్షించుకోవడానికి ఇద్దరు మిలటరీ అధికారులు సిద్ధమవుతారు. ప్రాణాలకు తెగించి అత్యాధునిక వార్ హెడ్స్ నుంచి అమాయకులైన ప్రజలను కూడా కాపాడతారు. ఈ చిత్రంలో జనరల్ జోసెఫ్ కాల్టన్‌గా బ్రూస్ విల్లీస్, రోడ్ బ్లాక్‌గా డ్వేన్ జాన్సన్ నటించారు. యాక్షన్ ప్రియుల్ని బాగా ఆకట్టుకునే చిత్రమని నిర్మాతలు చెప్తున్నారు.

  మొదట ఈ చిత్రానికి జి.ఐ.జో - కోబ్రా స్ట్రయిక్స్‌ అనే టైటిల్‌ పెడదామని అనుకుంటే రచయిత రెట్‌ రీజ్‌ వ్యతిరేకించారు. అంతేకాదు మొదట ఈ చిత్రానికి దర్శకుడుగా స్టీఫెన్‌ సొమ్మర్స్‌నే అనుకున్నా, పారామౌంట్‌ పిక్చర్స్‌ వారు కలుగ చేసుకుని ఇతివృత్తం గురించి చర్చలు జరుగుతున్న సమయంలో జోన్‌ ఎం. చూని డైరెక్టర్‌గా రంగ ప్రవేశం చేయించారు. అమెరికాలోని లూసియానాలోను, వాంకోవర్‌, బ్రిటిష్‌ కొలంబియా, కెనడాలోను ఈ చిత్రం షూటింగ్‌ నిర్వహించారు.

  ఇక కథ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అమాయక ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను తమ ఆధునిక మారణాయుధ పరిజ్ఞానంతో మట్టుబెట్టాలన్న లక్ష్యంతో వివిధ చోట్ల తమ అనుచరులను ఉంచుతారు జోర్టాన్‌. జోర్టాన్‌, మరో కమాండర్‌కి అసలు అధినేత కోబ్రా కమాండర్‌. ఇతడు గతంలో అమెరికన్‌ ప్రెసిడెంట్‌ వేషంలో తిరిగేవారు. అలా అమెరికన్‌ ప్రభుత్వాన్ని నమ్మించి, జి.ఐ.జో. టీమ్‌లోని వారందరినీ ప్రభుత్వాన్ని కులదోసే ద్రోహులుగా పరిగణించేలా చేస్తాడు. దాంతో జి.ఐ.జో టీమ్‌లోని ముఖ్యులంతా ఏకమై 'ద్వితీయ అమెరికా విప్లవం' పేరుతో రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కోబ్రా కమాండర్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రపంచ ఆధిపత్యం కోసం జరిగే ఈ పోరాటాల్ని క్షణక్షణం ఉత్సుకత పెంచేలా రూపొందించారు దర్శకుడు జోన్‌ ఎం. చూ.

  జి.ఐ.జో - ది రైజ్‌ ఆఫ్‌ కోబ్రాగా 2009లో విడుదలైన చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందించారు. జూన్‌ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈ చిత్రం పంపిణీదారులైన పారామౌంట్‌ పిక్చర్స్‌. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే హక్కులు పారామౌంట్‌ పిక్చర్స్‌కే లభించాయి. స్టీఫెన్‌ ఎ.విండాన్‌ ఛాయాగ్రహణం, హెన్రీ జాక్మెన్‌ సంగీతం ఈ చిత్రానికి అదనపు సొగసులుగా అమరాయి. రోగర్‌ బార్టీన్‌, జిమ్‌ మే ఈ చిత్రానికి ఎడిటర్లుగా వ్యవహరించారు. లారింజ్‌ డి బొన వెంచురా, బ్రయిన్‌ గోల్డ్నర్‌ ఈ చిత్రానికి నిర్మాతలు.

  English summary
  
 G.I. Joe: Retaliation (also known as G.I. Joe 2 or G.I. Joe 2: Retaliation) is an upcoming 2013 American science fiction action film directed by Jon M. Chu, based on Hasbro's G.I. Joe toy, comic and media franchises. It is a sequel to 2009's G.I. Joe: The Rise of Cobra. The film was written by Zombieland writers Rhett Reese and Paul Wernick. G.I. Joe: Retaliation features an ensemble cast, starring Bruce Willis and Dwayne Johnson, with Channing Tatum, Arnold Vosloo, Ray Park, Jonathan Pryce, and Lee Byung-hun reprising their roles from the first film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X