For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టబు నటించిన చిత్రానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌

  By Srikanya
  |
  లాస్‌ ఏంజిలిస్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ' లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కి ఎంపికైంది. 70వ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో టబు నటించిన ఈ చిత్రం అత్యుత్తమ ఒరిజినల్‌ చిత్రంగా ఈ చిత్రం బహుమానం గెలుచుకుంది. దాంతో చిత్రం దర్శకుడు,యూనిట్ చాలా సంతోషంగా ఉన్నారు. తమ ఆనందాన్ని మీడియా ద్వారా వ్యక్తం చేసారు. ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రానికి మైకెల్‌ డాన్నాకు అవార్డు దక్కింది.

  ఆంగ్‌ లీ గతంలో 'క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్', 'హల్క్' మరియు 'బ్రోక్ బ్యాక్ మౌంటైన్' లాంటి ఇంగ్లీష్ చిత్రాలను తీసి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నారు. సూరజ్‌ శర్మ అనే బాలుడు పై పటేల్‌ పాత్రలో నటించారు. హిందీ తారలు ఇర్ఫాన్‌ ఖాన్‌, టబు ప్రధాన పాత్రల్లో కనిపించారు. పదకొండేళ్ల కిందట యాన్‌ మార్టెల్‌ రాసిన నవల దీనికి ఆధారం. సుమారు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కి ప్రపంచ నలుమూలల నుండి మంచి స్పందన వస్తోంది. నవంబరు 23న ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలో ఈ సినిమాను విడుదల చేశారు.

  చిత్రం కథ ఏమిటంటే - సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక పెద్ద షిప్ మునిగిపోగా అందులో నుంచి బతికిన పై అనే 16 సంవత్సరాల యువకుడు అక్కడి నుండి ఒక చిన్న పడవలో పై తో పాటు ఒక బెంగాల్ టైగర్, ఒక కోతి, ఒక జీబ్రా మరియు ఒక హైనాలతో అతని జర్నీ ఎలా సాగింది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. పాండిచ్చేరికి చెందిన పై పటేల్‌ అనే అబ్బాయి, రిచర్డ్‌ పార్కర్‌ అనే పులితో కలిసి దాదాపు 227 రోజులు పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రయాణించాల్సి వస్తుంది. సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రం.

  70వ వార్షిక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కాలిఫోర్నియాలోని హిల్టన్‌ హోటల్‌లో వేడుకగా సాగింది. మోషన్‌ పిక్చర్‌ విభాగంలో 'ఆగ్రో', లెస్‌ మిజరేబుల్స్‌ చిత్రాలు అవార్డులు అందుకున్నాయి. 'లెస్‌ మిజరేబుల్‌' చిత్రంలో నటనకు హ్యూజాక్‌మెన్‌ ఉత్తమ నటుడిగా, 'సిల్వర్‌ లైనింగ్‌ ప్లేబుక్‌' చిత్రం ద్వారా జెన్నిఫర్‌ లారెన్స్‌ ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ఆగ్రో చిత్ర దర్శకుడు బెన్‌ అఫ్లెక్‌ కూడా అవార్డు వరించింది. డ్రామా విభాగంలో ఉత్తమ నటుడిగా డేనియల్‌ డే లేవిస్‌, ఉత్తమ నటిగా జెస్సికా చాస్టేన్‌ అవార్డులు అందుకున్నారు.

  బ్రిటిష్‌ గాయని నటి అయిన అడీల్‌కు 'స్కైఫాల్‌' చిత్రంలో అత్యుత్తమనటన ప్రదర్శించినందుకు ఉత్తమ నటి అవార్డు లభిచింది. 'ఆర్గో' ' లెస్‌ మిజరబల్స్‌' చిత్రాలకు అత్యుత్తమ చిత్రాలుగా అవార్డులు లభించాయి. జేసన్‌ స్టాథామ్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌లు, ఉత్తమ ఒరిజనల్‌ చలనచిత్‌ ట్రోఫీలను మైకేల్‌ డానాకు ప్రదానం చేశారు.' లైఫ్‌ ఆఫ్‌ పై' చి త్రానికి మంచి సెట్టింగ్‌లు వేసింనందుకు ఈ అవార్డులభిచింది. ఇదే కేటగిరీలో 'అన్నా కెరినీనా' చిత్రానికి గాను డారియో మారియానెల్లి, 'ఆర్గో' చిత్రానికి అలెగ్జాండర్‌ డెస్ల్పాట్‌, 'లింకన్‌' చిత్రానికి జాన్‌ విలియమ్స్‌, 'క్లౌట్‌ అట్లాస్‌' చిత్రానికి టామ్‌ టైక్వెర్‌ జానీ క్లిమెక్‌ రైన్‌హోల్డ్‌ హైల్‌లకు కూడా అవార్డులు లభించాయి.

  English summary
  Ang Lee's 'Life of Pi' took home the best original score award at the 70th Golden Globes announced today, while British songstress Adele collected a trophy for her rendition of the theme tune to the James Bond blockbuster "Skyfall."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X