»   » ఒక్కరోజులో పది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్..

ఒక్కరోజులో పది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

యమ్ టివి రియాలిటి సిరిస్ ది హిల్స్ తో హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక మైన స్దానాన్ని సంపాదించుకున్నారు హైదీ మాంటాగ్. ది హిల్స్ సిరిస్ షూటింగ్ సమయంలో తన కోస్టార్ అయినటువంటి స్పెన్సర్ ప్రాట్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఏప్రిల్ 2009లో ఈడేటింగ్ కోద్దిగా పెళ్శికి దారితీసింది, దానితో ఏప్రిలో పెళ్శి చేసుకోవడం జరిగింది. పెళ్శై పదహేను నెలలు కాకముందే స్పెన్సర్ ప్రాట్ నుండి విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హాలీవుడ్ లోఇలాంటివన్ని మామూలే కదా అని తన అభిమానులు సరిపెట్టుకున్నారు.

అంతేకాకుండా ఏప్రిల్ 2007లో బ్రెస్ట్ ట్రీట్ మెంట్ తీసుకోని తన స్దనములను మంచి షేపుకు తీసుకోని వచ్చారు. మొట్టమొదట ఇదంతా రూమర్ అని కోట్టి పారేయడం జరిగింది. కోన్నాళ్శ తర్వాత హైదీ మాంటాగ్ తనకు తానే యుయస్ వీక్లీకి తన బ్రెస్ట్ సర్జరీ గురించి వివరించారు. నవంబర్20, 2009వ సంవత్సరంలో ఒక్కరోజులో తనకు పది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హైదీ మాంటాగ్ పీపుల్ మ్యాగజైన్ కు ఆవివరాలను జనవరి 2010లో వివరించారు. ఆవిషయం తెలిసిన యావత్ హాలీవుడ్ మొత్తం ఒక్కరోజులో పది ప్లాస్టిక్ సర్జరీలా అంటూ నోరు వెల్లబెట్టడం జరిగింది.

ఈపది ప్లాస్టిక్ సర్జరీల వల్ల హైదీ మాంటాగ్ శరీరం మరిన్ని షేపులను సంతరించుకుంది. దానితో ఇటీవల జరిగినటువంటి హాలోవీన్ పార్టీకి గోల్ట్ మిని డ్రస్సుని ధరించి తన అందాలను చూపరులకు చూపించారు. ఇంకోక స్పెషాలిటి ఏమిటంటే ఈగోల్ట్ డ్రస్సుని తనకు తానే డిజైన్ చేసుకున్నానని సగర్వంగా అందరి ముందు చిలకపలుకలతో చెప్పారు. ప్రస్తుతం నేను నాకెరీర్ పైదృష్టిపెడుతున్నాను. ఇక నాశరీరం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. చివరగా గతంలో విడాకులు తీసుకున్నటువంటి తన మాజి భర్త స్పెన్స్రర్ ప్రాట్ తోకలసివచ్చి మరీ అందరిని ఆశ్చర్యంతో ముంచెత్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu