»   » హైతీ భూకంప బాధితులకు తారల విరాళాల వెల్లువ

హైతీ భూకంప బాధితులకు తారల విరాళాల వెల్లువ

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత 12, 13 తేదీల్లో హైతీ దేశాన్ని తాకిన భారీ భూకంపం తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది వికలాంగులుగా, నిరాశ్రయులుగా మిగిలిపోయారు. దీంతో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో చావురాక, భయం భయంగా, నిర్జీవంగా రోజులను గడుపుతున్నారు. ఇలాంటి ధీన స్థితిలో వున్న వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు.

సినిమాల్లో తలుకుబెలుకులతో ఆకట్టుకునే తారలు కూడా తమ దయార్థహృదయాన్ని చాటుకుంటూ తమ వంతు సాయం చెయ్యడానికి ముందుకొస్తున్నారు. వీరిలో మొదటగా చెప్పాల్సింది ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేస్తున్న ఏంజలీనా జోలీ-బ్రాడ్ పిట్ జంట. వీరు హైతీ బాధితులకు మినియన్ డాలర్లను విరాళంగా అందజేసారు. వీరి బాటలోనే బ్రాడ్ పిటా మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ 5 లక్షల డాలర్లను విరాళంగా అందజేసింది.

వీరి బాటలోనే ప్రముఖ హాలీవుడ్ తారలు మడోన్నా, బ్రిట్నీ స్పియర్స్, లేడీ గాగా వంటి ప్రముఖులు కూడా తమ వంతు సాయాన్ని అందజేసి వారి దయార్థ హృదయాలను చాటుకున్నారు. సినిమాల్లోనే కాక నిజజీవితంలో కూడా హీరోలు అనిపించుకున్న వీరు అభినందనీయులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu