»   » కాన్సర్ ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్లు తెలియచేసిన సూపర్ స్టార్

కాన్సర్ ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్లు తెలియచేసిన సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu
లాస్ ఏంజిల్స్: 'ఎక్స్ మెన్' సిరీస్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకొన్న హాలీవుడ్ నటుడు హగ్ జాక్ మేన్ ప్రస్తుతం స్కిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆయన ఈ విషయాన్ని స్వయంగా ఇనిస్ట్రగ్రామ్ ద్వారా తెలియచేస్తూ... అద్బుతమైన డాక్టర్స్ సక్సెస్ పుల్ గా ఆ కణాలను తొలిగించారని రాసుకొచ్చారు.

ఇక ఈ Basal cell carcinoma ని సంక్షిప్తంగా BCC అంటారు. ఇదో రకమైన స్కిన్ కాన్సర్. శరీరం ఎక్కువగా సూర్యుడు నుంచి వచ్చే అల్ట్రా వైలట్ కిరణాలకు ఎక్సపోజ్ అయితే వచ్చే అవకాసం ఉందని అంటారు. స్కిన్ కాన్సర్ ఫౌండేషన్ వారు చెప్పేదాని ప్రకారం... ఇది అతి సామాన్యంగా , ఎక్కువ మందికి వచ్చే స్కిన్ కాన్సర్. అమిరికాలో ప్రతీ సంవత్సరం మూడు మిలియన్ కేసులు బయిటపడుతున్నాయి.

Hugh Jackman Confirms About His Cancer Via Instagram

హగ్ జాక్ మేన్ తొలిసారిగా 2013లో ఈ కాన్సర్ బారిన పడ్డారని గమనించి, ట్రిట్ మెంట్ తీసుకున్నారు. తన ముక్కుపై కొత్తగా వచ్చిన పుట్టుమచ్చని గమనించి బార్య సలహాపై డాక్టర్ ని సంప్రదించారు.

ఈ విషయమై హగ్ మీడియాతో మాట్లాడుతూ.. "నేను ప్రతీ మూడు నెలలకు చెక్ అప్ కు వెళ్తాను. ఇది నా జీవితంలో ఓ కామన్ విషయం అయ్యిపోయింది.." అన్నారు.

ఇక ఎక్స్ మెన్' సినిమాలో శరీరంపై ఎటువంటి దెబ్బనైనా సరే క్షణాల్లో మాయం చేసే విచిత్రమైన శక్తి కలిగిన జాక్ మెన్ కు నిజజీవితంలో నయం కాని స్కిన్ క్యాన్సర్ రావడంతో ఆయన అభిమానులతోపాటు.. 'ఎక్స్ మెన్' సిరీస్ చిత్రాల ఫ్యాన్స్ అందరూ తెగ బాధపడిపోతున్నారు!

English summary
The celebrated Hollywood actor and the X-Men star took to his social platform Instagram to confirm about his cancer, which has been operated and removed successfully. Using the opportunity to share the news with his 10 Million fans, Hugh Jackman wrote on his social platform, "Another basal cell carcinoma. Thanks to frequent body checks and amazing doctors, all is well. Looks worse with the dressing on than off. I swear! #wearsunscreen"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu