»   » 'కుంగ్‌ ఫూ యోగా' చేస్తున్న జాకీ ఛాన్, డిటేల్స్

'కుంగ్‌ ఫూ యోగా' చేస్తున్న జాకీ ఛాన్, డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: త్వరలో 'కుంగ్‌ ఫూ యోగా' చిత్రంలో నటించనున్నారు జాకీచాన్‌. ఆ సినిమా చిత్రీకరణ కోసం ఇండియాకు రాబోతున్నట్లు జాకీచాన్‌ తెలిపారు. 'కుంగ్‌ ఫూ యోగా' చిత్రం తొలి ఇండియా-చైనా కో ప్రొడక్షన్ చిత్రం అవుతుంది. గత సెప్టెంబర్ లో ఈ చిత్రం సైన్ చేసారు. గతంలో జాకీచాన్..బాలీవుడ్ నటి మల్లికాషెరావత్ తో కలిసి ది మిత్ చిత్రం చేసారు. అలాగే ఆయన 2013లో చైనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంచింగ్ కోసం న్యూడిల్లీ వచ్చారు. అప్పుడు జాకీఛాన్ చిత్రం చైనీస్ జోడియాక్ ని తో ఆ ఫెస్టివల్ ని ప్రారంభించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే బాలీవుడ్‌ సినిమాలో నటించాలని ఉందన్న తన మనసులోని కోరికను జాకీచాన్‌ బయటపెట్టారు. ''నాకు హాలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ తేడాల్లేవు. స్క్రిప్టు నచ్చడం ముఖ్యం'' అన్నారు జాకీ.

Jackie Chan Planning to Shoot India-China Co-Production 'Kung-Fu Yoga'

ఇక బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ '3 ఇడియట్స్‌', 'పీకే' లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆ మాటకొస్తే చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులూ ఆమీర్‌కు అభిమానులే. ఈ క్రమంలో మరో ప్రముఖ హీరో ఆమీర్‌ అభిమానిగా మారాడు. అతనెవరో కాదు చైనీస్‌ సూపర్‌ స్టార్‌ జాకీచాన్‌.

ఆమీర్‌ నటించిన '3 ఇడియట్స్‌' చైనాలో విడుదలై అక్కడా ఘనవిజయం సాధించింది. ఆ సినిమాతోనే 'పీకే' ఆమీర్‌ అభిమానిగా మారిపోయానంటున్నాడు జాకీచాన్‌. ''నేను బాలీవుడ్‌ చిత్రాలు చూసేది చాలా తక్కువ. 2009లో హాంకాంగ్‌లో '3 ఇడియట్స్‌' చూశా. అందులో ఆమీర్‌ నటన చూడగానే వెంటనే ఆయన అభిమానిగా మారిపోయా. ఆమీర్‌ అద్భుతమైన నటుడు'' అన్నారు జాకీచాన్‌.

English summary
Jackie Chan has revealed he could be heading to India later this year to shoot action comedy Kung-Fu Yoga. The India-China co-production was first announced in 2014 as a partnership between Viacom18 Motion Pictures India and China's Taihe Entertainment Corp. a
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu