twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జేమ్స్ బాండ్’ పాత్రలు మగాళ్లకేనా, మహిళలకు అవకాశం ఇవ్వాలి: పియర్స్ బ్రాస్నన్

    |

    ప్రపంచ సినిమా చరిత్రలో జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలన్ని హీరో కోణంలోనే సాగాయి. ఒక మహిళను బహుషా మనం 007 ఏజెంటుగా ఊహించి కూడా ఉండం. అయితే ఈ ధోరణి మారాల్సి ఉంది అంటున్నారు... ప్రముఖ హాలీవుడ్ నటుడు, గతంలో జేమ్స్ బాండ్ చిత్రాల్లో హీరోగా నటించిన పియర్స్ బ్రాస్నన్.

    ప్రస్తుతం తెరకెక్కుతున్న 25వ బాండ్ మూవీ 'నో టైమ్ టు డై' తర్వాత వచ్చే బాండ్ చిత్రాల్లో నటి లాషనా లించ్ లీడ్ రోల్ చేసే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పియర్స్ బ్రాస్నన్ స్పందిస్తూ సమర్ధించారు.

    లేడీ జేమ్స్ అయితే బావుంటుంది

    లేడీ జేమ్స్ అయితే బావుంటుంది

    హాలీవుడ్ రిపోర్టర్ అనే పత్రికతో పియర్స్ బ్రాస్నన్ మాట్లాడుతూ... ‘గత 40 సంవత్సరాలుగా మగాళ్లే జేమ్స్ బాండ్ పాత్రలు చేయడం చూశాం. అయితే ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. లేడీ జేమ్స్ బాండ్ అయితే ఈ ఫ్రాంచైజీ సినిమాలపై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది' అన్నారు.

    కాలంతో పాటు మారాలి

    కాలంతో పాటు మారాలి

    #MeToo యుగంలో ఫ్రాంచైజీ ఎలా వ్యవహరిస్తుంది అనే అంశంపై బ్రాస్నన్ స్పందిస్తూ... కాలంతో పాటు మనం మారవలసి ఉంటుందని చెప్పారు. #MeToo ఉద్యమం మన సమాజానికి సంబంధించినది, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవసరమే అన్నారు.

    జేమ్స్ బాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది

    జేమ్స్ బాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది

    నాలుగు జేమ్స్ బాండ్ చిత్రాలలో బ్రాస్నన్ నటించారు. "జేమ్స్ బాండ్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఆ పాత్ర చేయడం ఎంతో గర్వకారణం. ఇది నాకు ఎంతో గుర్తింపు తెచ్చింది, ఇది నాకు ఎంతో నచ్చిన పాత్ర, ఇందులో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నట్లు బ్రాస్నన్ తెలిపారు. ది వరల్డ్ ఈస్ నాట్ ఎనఫ్, డై అనదర్ డే, టుమారో నెవెర్ డైస్, గోల్డెన్ ఐ చిత్రాల్లో బ్రాస్నాన్ నటించారు. బ్రాస్నన్ త్వరలో విల్ ఫారెల్, రాచెల్ మెక్ఆడమ్స్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్ కామెడీని సిరీస్‌లో నటించబోతున్నారు.

    నో టైమ్ టు డై

    నో టైమ్ టు డై

    జేమ్స్ బాండ్ 25వ చిత్రం 'నో టైమ్ టు డై' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కారీ ఫుకునాగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్, 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది డేనియల్ క్రెయిగ్ చేస్తున్న 5వ, చివరి బాండ్ మూవీ. 2006లో వచ్చిన కాసినో రాయల్‍‌తో బాండ్ హీరోగా పరిచయమైన డేనియల్ క్రెయిగ్ ఆ తర్వాత క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008), స్కైఫాల్(2012), స్పెక్టర్(2015) చిత్రాల్లో నటించాడు.

    English summary
    Speaking to Hollywood Reporter, James Bond actor Pierce Brosnan said, "I think we've watched the guys do it for the last 40 years, get out of the way, guys, and put a woman up there. I think it would be exhilarating, it would be exciting," he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X