Don't Miss!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
21 సంవత్సరాల ఆధిపత్యాన్ని పోగొట్టారు... మళ్లీ రికార్డుల దిశగా టాప్ డైరెక్టర్!
Recommended Video
అవెంజర్స్: ఎండ్‌గేమ్... అవతార్ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలోకి వెళ్లిన నేపథ్యంలో.... ప్రధాన పోటీదారుగా ఉన్న అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఏదైనా వివాదాస్పద కామెంట్ చేస్తారని అంతా ఊహించారు. అందరూ ఇలా ఊహించడానికి కారణం గతంలో సూపర్ హీరో చిత్రాలను కామెరూన్ విమర్శిచడమే. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిస్నీ, మార్వెల్ సంస్థల అచీవ్మెంటును అభినందిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... ఎండ్‌గేమ్ సక్సెస్ తనలో చాలా నమ్మకాన్ని పెంచింది అని వ్యాఖ్యానించారు.

ప్రజలు ఇంకా థియేటర్లకు వెళుతున్నారు అనడానికి ఎండ్‌గేమ్ ఫలితాలే సాక్ష్యం
డెడ్‌లైన్ అనే వార్త సంస్తకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కామెరాన్ ఇలా అన్నాడు, "అవెంజర్స్: ఎండ్‌గేమ్ విజయం ప్రజలు ఇప్పటికీ సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళుతున్నారు అనడానికి నిదర్శనం. అవతార్ 2, అవతార్ 3 రూపొందించే సమయంలో నన్ను ఎక్కువగా భయపెట్టిన విషయం ఏమిటంటే, మార్కెట్ చాలా మారిపోయి ఉండవచ్చు, సినిమా చూడటానికి ప్రజలు థియేటర్లకు రాకపోవచ్చు అనుకున్నాను'' అన్నారు.

21 సంవత్సరాల పాటు నెం.1 స్థానంలో
ఇటీవలే 65 ఏళ్లు నిండిన కామెరాన్ తన కెరీర్‌లో కేవలం 10 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మార్వెల్ వరల్డ్ నెంబర్ 1 స్థానం స్వాధీనం చేసుకునే ముందు అతను ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్ర దర్శకుడిగా 21 సంవత్సరాలు తన హవాకొసాగించారు. ప్రస్తుతం ఆయన అవతార్ 2, అవతార్ 3 చిత్రాలను రూపొందిస్తున్నారు. అవతార్ 4, అవతార్ 5 ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

ఈ చిత్రాలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తాయా?
"అవతార్ 2, 3 చిత్రాలు మొదటి భాగం మాదిరిగా బాక్సాఫీస్ వద్ద చరిత్రసృష్టించగలవా? ఎవరికీ తెలుసు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మేము సాధించవచ్చు, సాధించకపోవచ్చు. అయితే ఇది సాధ్యమే అని మేము నమ్ముతున్నాము " అని కామెరాన్ అన్నారు.

చైనా మార్కెట్ ప్లస్సవుతుందా?
2009 లో మొట్టమొదటి అవతార్ చిత్రం విడుదలైనప్పుడు, చైనా మూవీ మార్కెట్ ప్రారంభ దశలో ఉంది. తరువాతి దశాబ్దంలో, ఇది ప్రపంచ రెండవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది, ఇది అవతార్ సీక్వెల్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ప్లస్సవుతుందని భావిస్తున్నారు. అవతార్ 2 డిసెంబర్ 17, 2021 విడుదల చేయాలని నిర్ణయించగా, అవతార్ 3 డిసెంబర్ 2023లో వచ్చే అవకాశం ఉంది.