Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Titanic: సరికొత్తగా 3D వెర్షన్ లో మళ్ళీ రాబోతున్న టైటానిక్.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్!
వరల్డ్ సినిమా హిస్టరీ లోనే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సినిమాల్లో టైటానిక్ నెంబర్ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఆల్ టైం గ్రేటెస్ట్ మూవీస్ లలో కూడా ఇది బెస్ట్ సినిమా అని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. అయితే ఎంతగానో గుర్తింపును అందుకున్న ఈ సినిమాను మరోసారి వెండి తెరపై చూపించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు. టైటానిక్ సినిమా 1997 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
నిజమైన టైటానిక్ నౌక మునిగిపోయిన అంశాన్ని ప్రధానంగా చేసుకొని దర్శకుడు జేమ్స్ కెమెరున్ ఇందులో ఒక అందమైన ప్రేమ కథను జోడించాడు. ఇక రియల్ కథలో టైటానిక్ పడవకు వచ్చిన ప్రమాదం ఏమిటి అసలు అది ఎందుకు మునిగిపోయింది మునిగిపోయిన తర్వాత ఎలాంటి విషాదాలు చోటుచేసుకున్నాయి అని ఎన్నో అంశాలను ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు. అప్పట్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది వీక్షించిన సినిమాల్లో ఒకటి.

ఇప్పటికీ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ లిస్టులో అయితే టాప్ 3లో ఉండడం విశేషం. ఇక టైటానిక్ సినిమాను మళ్లీ 3D లోకి అనువదించి సరికొత్తగా విడుదల చేయడానికి పారమౌంట్ పిక్చర్స్ సిద్ధమవుతోంది. పారమౌంట్ పిక్చర్స్ 20th సెంచరీ ఫాక్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా విడుదలై 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా సరికొత్తగా మళ్ళీ రీ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఫిబ్రవరి 10వ తేదీన సినిమాను సరికొత్త వెర్షన్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Celebrate the 25th anniversary of the timeless love story this Valentine’s Day Weekend.
— Paramount Pictures (@ParamountPics) January 10, 2023
#Titanic returns to the big screen in remastered 4K 3D on February 10. pic.twitter.com/WcBFJJ8hBI
4K క్వాలిటీతో 3D వెర్షన్ లో ఈ సినిమాలను విడుదల చేస్తున్నట్లుగా ఒక అద్భుతమైన ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. వాలెంటైన్స్ డే సందడిలో టైటానిక్ రీ రిలీజ్ మంచి క్రేజ్ అందుకుంటుంది అని అనిపిస్తోంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.