»   » అత్యధిక పారితోషికం అందుకునే ఆ హీరో మరణించాడా..!? అదంతా ఒట్టిపుకారే..!!

అత్యధిక పారితోషికం అందుకునే ఆ హీరో మరణించాడా..!? అదంతా ఒట్టిపుకారే..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఘోరాతి ఘోరమైన ఒక రోడ్ యాక్సిడెంట్ లో సుప్రసిద్ధ హాలీవుడ్‌ నటుడు జానీ డెప్‌ మరణించాడన్న విషయం సంచలనం సృష్టించింది. ఈ వార్త నిజమో, వదంతో తేలని సందిగ్ధస్థితి ఏర్పడింది. ఒక విహార యాత్రికుడు, మద్యం సీసాలమధ్య తునాతునకలైన డెప్ కారుని అతని శరీరాన్ని చూశాడనే వార్తను ఒక ఫేక్‌ సిఎన్‌ఎన్‌ వెబ్ సైట్ ప్రసారం చేసింది. మద్యపానమే ఈ యాక్సిడెంట్‌ కు కారణమని పోలీసులు ధృవీకరించారని కూడా, ఆ వార్తాసంస్థ ప్రకటించింది. దీంతో ప్రపంచం యావత్తూ ఒక్క సారి ఉలిక్కిపడింది. కానీ ఈ వార్త కేవలం ఓ పుకారు మాత్రమేనని తేలిపోయింది.

ఈ వార్తను డెప్ అసోసియేటెడ్‌ కంటెంట్‌ రైటర్ ర్యాక్ క్రిస్టోఫర్‌ డి వాల్ట్‌ కొట్టిపారేసాడు. నాకు తెలిసినంత వరకూ, జానీ డెప్‌ చాలా కులాసాగా వున్నాడు. అతను ఎలాంటి కార్‌ ప్రమాదానికీ గురికాలేదు అని వాల్ట్ తెలిపాడు. ఈ వార్త ఓ పుకారు మాత్రమే అని తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం డెప్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, ది టూరిస్ట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా టామ్ క్రూజ్, టామ్ హాంక్స్, బ్రిట్నీ స్పియర్స్ వంటి ప్రముఖులు చనిపోయారనే వదంతులు వెలువడ్డాయి. ఇప్పుడీ జాబితాలో డెప్ కూడా చేరిపోయాడు. ఈ ఫేక్ వెబ్ సైట్ ప్రచురించిన వార్తను మీరు ఇక్కడ చూడవచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu