»   » జూరాసిక్ వరల్డ్ మూవీ... టెక్నాలజీ రహస్యం ఇదే (వీడియో)

జూరాసిక్ వరల్డ్ మూవీ... టెక్నాలజీ రహస్యం ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల విడుదలైన ‘జూరాసిక్ వరల్డ్' సినిమా చూసిన వారు అందులో పెద్ద పెద్ద డైనోసార్లను చూసి ఆశ్చర్య పడే ఉంటారు. అసలు భూమిపై ఇపుడు మనుగడలో లేని జంతువులను ఉన్నది ఉన్నట్లుగా రియలిస్టిగ్ గా చూపించడం అద్భుతం. ఓ సీన్లో రాకాసి డైనోసార్ దాడిలో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్న సాధారణ డైనోసార్‌ను హీరో ఓదార్చే సన్నివేశం అయితే సూపర్బ్. ఇంతకీ అ సీన్ ఎలా తీసారు? దాని వెనక రహస్యం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

జూరాసిక్ వరల్డ్ మూవీ అందరూ ఊహించినట్లుగానే వసూళ్ల విషయంలో రికార్డులు తిరగరాసింది. జూన్ 11న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి వీకెండ్ బాక్సాఫీసు బద్దలయ్యే కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 511 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మన కరెన్సీలో ఈ లెక్క రూ. 3 వేల కోట్ల పైమాటే.

ఒళ్లు గగుర్బొడిచే సాహసాలు, డైనో సార్స్ గురించి సాగే మూవీ ‘జురాసిక్ పార్క్'. తొలిసారి 1993లో స్పీల్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన 'జురాసిక్‌ పార్క్‌...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. అప్పట్లో ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సీరీస్ లో 3 సినిమాలు వచ్చి భారీ విజయం సాధించాయి. తాజాగా 4వ ఎడిషన్ ‘జురాసిక్ వరల్డ్' కూడా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది.

Jurassic World: Building the Apatosaurus

ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించారు. క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్ర పోషించగా, బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించాడు.

English summary
Watch Jurassic World: Building the Apatosaurus Making Video. Legacy Effects bring a dinosaur to life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu