»   » ఫుట్‌బాల్ స్టార్‌తో కలిసి సినిమా చేయబోతున్న జస్టిన్ బీబర్

ఫుట్‌బాల్ స్టార్‌తో కలిసి సినిమా చేయబోతున్న జస్టిన్ బీబర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాశ్చాత్య పాప్ సంగీత ప్రపంచంలో చిన్న వయసులోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ జస్టిన్ బీబర్. బీబర్ కు సంగీతంతో పాటు ఫుట్ బాల్ ఆట అన్నా చాలా ఇష్టమే. ఆ ఇష్టమే అతన్ని ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో సాగే సినిమాలో భాగమయ్యేలా చేసింది.

హాలీవుడ్లో భారీ బడ్జెట్ త్వరలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. స్పానిష్ ఫుల్ బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను హార్వే వెన్‌స్టెన్ నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

Justin Bieber To Star Alongside Cristiano Ronaldo In A Movie About Football

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ప్రముఖ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా నటించబోతున్నాడు. క్రిస్టియానో రొనాల్డో రియల్ మాడ్రిడ్ తరుపున అనేక మ్యాచ్ ల్లో ఆడారు. అందుకే రియాల్టీ కోసం క్రిస్టియానాను ఎంపిక చేసారు.

ఈ సినిమాలో జస్టిన్ బీబర్ యంగ్ అమెరికన్ ఫుట్ బాలర్ గా కనిపించబోతున్నారు. ఫుట్ బాల్ ఆటలో మంచి టాలెంట్, స్కిల్స్ ఉన్న అతడు ఓవర్ నైట్ స్టార్ ఎలా అయ్యాడు అనే కాన్సెప్టుతో ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పాత్ర సినిమాలో కీలకంగా ఉండబోతోందని, 2017లో వచ్చే బిగ్గెస్ట్ హాలివుడ్ చిత్రాల్లో ఇదీ ఒకటి కాబోతోందని అంటున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

English summary
Behold fans from both the hemispheres, one pop sensation is about to join another football heart-throb in an upcoming Hollywood blockbuster about football. The Canadian pop singer is all but steady to feature in a new movie about football, which will be produced by Harvey Weinstein. It is believed the movie will revolve around the story based on the Spanish football club Real Madrid.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu