»   »  టైటానికి హీరోయిన్ రొమాన్స్: ఆమె కూతురుకు నచ్చడం లేదు!

టైటానికి హీరోయిన్ రొమాన్స్: ఆమె కూతురుకు నచ్చడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టైటానిక్ సినిమా చూసిన వారికి ఆ సినిమా హీరోయిన్, అందాల సుందరి కేట్ విన్ స్లెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నట, ఆకట్టుకునే అందం ఆమె సొంతం. లవ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు, పడకగది సన్ని వేశాల్లో నటించడంలో ఆమెకు ఆమే సాటి. అందుకు టైటానిక్ సినిమానే ఉదాహరణ.

ప్రస్తుతం కేట్ విన్ స్లెట్ వయసు 40 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. తాజాగా ఓ సినిమాలో ఆమె లియామ్‌ హెమ్స్‌వర్త్‌ అనే 25 ఏళ్ల కుర్రాడితో కలిసి నటిస్తోంది. ఇందులో ఇద్దరి మధ్య బెడ్రూం సీన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ సీన్లు ఆమె కూతురు, 15 ఏళ్ల మియా హనీకి అస్సలు నచ్చడం లేదట.

Kate Winslet got into bed with Hemsworth, made her daughter jealous

‘హెమ్స్‌వర్త్‌తో కలిసి నువ్వు చేసిన బెడ్‌సీన్స్‌ చూస్తుంటే నాకు అసూయగా ఉంద'ని డైరెక్ట్‌గా తన తల్లి కేట్‌కే చెప్పేసిందట. ఈ విషయాన్ని కేట్ విన్ స్లెట్ స్వయంగా మీడియాకు వెల్లడించింది. అందుకు కారణం అతగాడు మియామీ హనీ అభిమాన నటుడు కావడమే. ఇంతకు ముందు అతను ‘హంగర్ గేమ్స్' చిత్రంలో నటించాడు. ఆ సినిమా చూసినప్పటి నుండి మియామీ అతని అభిమాని అయిపోయింది.

కేవలం అతనంటే మియామీకి అభిమానం మాత్రమే కాదు, అతనంటే ఇష్టం. అతనిపై తనకూతురుకు క్రష్‌ కూడా ఉంది. తను అంతలా ఇష్టపడుతున్న వ్యక్తితో నేను ఇంటిమేట్‌ సీన్స్‌ చేస్తుంటే.. అవి చూసి తట్టుకోలేకపోతోంది. కానీ నేను నా వృత్తిలో భాగంగానే ఇదంతా చేస్తున్నాను అని కేట్ విన్ స్లెట్ మీడియాకు తెలిపింది.

English summary
Oscar-winning actor Kate Winslet’s daughter is jealous of her mother for getting to shoot steamy scenes opposite The Hunger Games star Liam Hemsworth. “When I told my daughter that I was shooting the scene that day she spluttered... I took it to be jealousy. But I did feel quite bad for Liam. He’s a sweet guy but I couldn’t stop giggling,” said the 40-year-old actor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu