twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోరికలు తీర్చమని వేధించేవాడు.. తట్టుకోలేకపోయా.. ఆయనో మూర్ఖుడు. కేట్ విన్స్‌లెట్

    By Rajababu
    |

    Recommended Video

    కోరికలు తీర్చమని వేధించేవాడు.. తట్టుకోలేకపోయా..

    హాలీవుడ్ దర్శకుడు హర్వే వెయిన్‌స్టెయిన్ కీచక పర్వాలపై ప్రముఖ హీరోయిన్లు వెలిబుచ్చుతున్న ఆవేదనకు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. హార్వే లైంగిక దాడులపై ప్రముఖ నటి టైటానిక్ చిత్ర హీరోయిన్ కేట్ విన్సెలేట్‌ బట్టబయలు చేసింది. ఆయన దురాగతాలను, వేధింపులను తట్టుకోవడం చాలా దుర్భరంగా మారింది అని కేట్ విన్స్‌లెట్ గుట్టువిప్పింది. ఇంకా కేట్ ఏమి చెప్పిందంటే..

     హర్వేని తట్టుకోవడం కష్టం

    హర్వేని తట్టుకోవడం కష్టం

    హర్వేతో పనిచేయడం చాలా కష్టం. అతన్ని తట్టుకోవడం చాలా మరీ కష్టం. చాలా దారుణమైన కోరికలను కోరేవాడు. అతడిని ప్రతీ విషయంలో ఎదిరించేదాన్ని. అందుకే నేనంటే ఆయనకు పడేది కాదు అని కేట్ విన్స్‌లెట్ చెప్పింది.

     హార్వే ప్రవర్తన మూర్ఖం

    హార్వే ప్రవర్తన మూర్ఖం

    నేను నటించిన నా తొలి చిత్రం హెవెన్లీ క్రీచర్స్ అనే చిత్రాన్ని 1994లో హార్వే పంపిణీ చేశారు. ఆ చిత్రంలో నాకు ఆ పాత్రను ఇవ్వడానికి చాలా ఇబ్బందిగానూ, మూర్ఖంగానూ ప్రవర్తించాడు అని కేట్ వెల్లడించింది.

     వెకిలిగా ప్రవర్తించేవాడు..

    వెకిలిగా ప్రవర్తించేవాడు..

    నన్ను కలిసిన ప్రతీసారి ఏదో అంటూ వెకిలికగా మాట్లాడేవాడు. నీకు మొదటి ఛాన్స్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోకు అని నాతో అనేవాడు. నీకు నాలుగు నెలలపాటు ఆడిషన్ చేశాను. అది మనసులో పెట్టుకో. నీ కెరీర్ కోసం నేను ఎవరెవరికీ సిఫారసు చేశానో నీకు తెలియదని అనేవాడు అని కేట్ పేర్కొన్నది.

     హార్వే బారిన పడకుండా

    హార్వే బారిన పడకుండా

    హర్వే బారిన పడకుండా ఉండటానికి నాకు నేనుగా జాగ్రత్త పడ్డాను. ది రీడర్ అనే సినిమాలో నటించినందుకు నన్ను ఆస్కార్‌కు నామినేట్ చేశారు. ఒకవేళ ఆస్కార్ గెలిస్తే నేను నా ప్రసంగంలో హర్వేకు థ్యాంక్స్ చెప్పవద్దు అని డిసైడయ్యాను.

     ఆస్కార్ తీసుకొనేటప్పుడు

    ఆస్కార్ తీసుకొనేటప్పుడు

    నేను నీకు థ్యాంక్ చెప్పను అనే విషయం కూడా ఆయన దృష్టికి తెచ్చాను. ఆ తర్వాత 2008లో ది రీడర్ సినిమాకు కేట్ విన్స్‌లెట్‌కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వేదికపై చేసిన ప్రసంగంలో నేను ఆయన పేరు ఎత్తలేదు అని కేట్ వెల్లడించింది.

     80 మంది మహిళలు ఆరోపణలు

    80 మంది మహిళలు ఆరోపణలు

    దర్శకుడు హార్వే వెయిన్‌స్టెయిన్ తమను లైంగికంగా వేధించారని పలువురు సెలబ్రిటీలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 80 మహిళలను తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆయనపై ఆరోఫనలు చేశారు. ఈ నేపథ్యంలో కేట్ విన్స్‌లెట్ కూడా వారికి జతకావడంతో హార్వే వివాదం మీడియాలో ప్రముఖంగా మారింది.

    English summary
    Academy Award-winning actress Kate Winslet made fresh allegations disgraced producer Harvey Weinstein as "horrible to deal with". Winslet said, I was one of the ones he would label 'difficult' because I wouldn't do the things he would ask for me to do on a business-level. These were ridiculous requests. He didn't like me because I wouldn't be bullied by him."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X