»   » ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ పాత్ర చివరకు ఆమెనే వరించింది...!

ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ పాత్ర చివరకు ఆమెనే వరించింది...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ నిజజీవిత ఆధారంగా రూపోందుతున్న చిత్రం 'డయానా'. ఈ సినిమాలో ప్రిన్సెస్ డయానా గా పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ హీరోయిన్ కైరా నైట్లీ నటిస్తుంది. ఈ డయానా పాత్ర కోసం ఎంతోమంది క్యూలో నిలబడగా చివరకు కైరా నైట్లీ ని వరించింది. కైరా నైట్లీ తో పాటుగా ది క్వీన్ హీరోయిన్ హెలెన్ మిర్రన్ కూడా నటిస్తున్నారు. హెలెన్ మిర్రర్ కైరా నైట్లీ తల్లిగా ఈ సినిమాలో నటిస్తున్నారు. 2011లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దానికి కారణం డయానా యాభైవ పుట్టినరోజు జరుపుకోవడం మరియు ప్రిన్స్ చార్లెస్ ను పెళ్శి చేసుకోని ముప్పయి సంవత్సారాలు అవుతుండడంతోపాటు యువరాజు విలియమ్స్ ఎప్పటినుండో ప్రేమిస్తున్నటువంటి తన గర్ల్ ప్రెండ్ కేట్ మిడిలిట్టాన్ ను వివాహాం చేసుకోబోతున్నాడని ఊహాగానాలు వస్తున్నందున ఈ సినిమా కూడా క్రేజిని సంపాదించుకుంటుందని అన్నారు. ఇక ప్రస్తుతానికి సినిమా ప్రధమార్దంలో ఉన్నప్పటికిగాను సినిమాని ఎలాగైనా 2011కే విడుదల చేస్తామని అంటున్నారు. ఇక కధ విషయానికి వస్తే డయానా జీవితంలో జరిగినటువంటి కోన్ని యధార్దలను ఈ సినిమాలో మీకు చూపించడం జరుగుతుందన్నారు. దానితో పాటు ప్రిన్స్ చార్లెస్ పెళ్శికాకముందు ఎలా ఉండేవాడో, డయానాని పెళ్శిచేసుకున్న తర్వాత వారిద్దరి మద్య జరిగిన కోన్ని సంఘటనలను సినిమాలో చూపించడం జరుగుతుందని సినిమా డైరెక్టర్ వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X