»   » 2011లో నా జేబులోకి 100 మిలియన్ డాలర్స్ రావాలనే ప్రయత్నం..

2011లో నా జేబులోకి 100 మిలియన్ డాలర్స్ రావాలనే ప్రయత్నం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాప్ సింగర్ లేడీగాగా 2011వ సంవత్సరంలో తను 100 మిలియన్ డాలర్స్ సంపాదించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనాల ప్రకారం లేడీగాగా 64 మిలియన్ డాలర్స్ సంపాదించారని సమాచారం. లేడీగాగా రాబోయే అరు నెలలో దాదాపు 41 షోస్ ప్రదర్శించడానికి సన్నాహాలు చేశారని ది పైనాన్సియల్ బై వీక్లీ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం లేడీగాగా చేస్తున్నటువంటి బార్న్ దిస్ వే అనే కొత్త ఆల్బమ్ మే లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

లేడీగాగా చేసేటటుంటి 41 షోస్ ద్వారా తాను చాలా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా వర్జిన్ మొబైల్, పోలరాయిడ్ లాంటి యాడ్ సంస్దల ద్వారా ఇంకొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇలా లేడీగాగా 2011 సంవత్సరం ఆదాయం ఎలాగైనా కాని 100 మిలియన్ డాలర్లు దాటాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం లేడీగాగా పాప్ సింగర్ గా అత్యున్నత స్దానంలో ఉన్నారు. అటువంటి దానిని మేము కమర్షియల్ గా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాం అని లేడీగాగా మేనేజర్ ట్రాయ్ కార్టర్ తేలియజేశారు.

English summary
Pop singer Lady Gaga is apparently set to earn an estimated 100 million dollars in 2011. According to Forbes magazine, the eccentric fashionista and entrepreneur earned approximately 64 million dollars last year. The financial bi-weekly projects the star will reel in the dough from her aggressive touring schedule (41 shows in the next six months) and her new album, ‘Born This Way’ set to drop in May, that is expected to be a hit-maker.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu