అమెరికా అత్యున్నత పౌర గౌరవం పొందిన మ్యూజిషియన్

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్, మే 31: అమెరికా అత్యున్నత పౌర గౌరవం 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' అవార్డుని ఆ దేశ లెజెండరీ సంగీతకారుడు 'బాబ్ డిలన్'కు ప్రకటించారు. ఈ అరుదైన గౌరవాన్ని 'బాబ్ డిలన్'తో పాటు 13 మందికి ప్రకటించినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. 71 సంవత్సరాల వయసు కలిగిన 'బాబ్ డిలన్' కు నేను పెద్ద అభిమానిని అంటూ, ఆయన మ్యూజిక్ రంగానికి చేసిన సేవలను అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కొనియాడారు.

ఈ సందర్బంలో బరాక్ ఒబామా మాట్లాడుతూ బాబ్ డిలన్ 23 వయసులో ఉన్నప్పుడు బాబ్ యొక్క వాయిస్, గులక రాళ్ళు వలె ఉండే ధ్వనిని మ్యూజిక్ శక్తి వలె ప్రజలు అనుభూతి అయ్యే విధంగా తన సందేశాన్ని అందించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాబ్‌కు కృతజ్ఞతలను తెలియజేయాలి. అమెరికన్ సంగీత చరిత్రలో బాబ్ డిలిన్ లాంటి ఒక పెద్ద దిగ్గజం లేడని ప్రశంసించాడు.

నేను బాబ్ డిలిన్‌కు పెద్ద అభిమానిని. నేను కాలేజి చదువుకునే రోజుల్లో బాబ్ డిలన్ పాటలను వింటూ ఈ దేశం గురించి ఆలోచించేవాడినని అన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఎంచుకున్న ఈ 13 మంది మెడల్ గ్రహీతలు అమెరికా యొక్క ప్రధాన భద్రత(ప్రపంచ శాంతి, సంస్కృతి, పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రయత్నాల)కు తోడ్పాటు చేసిన వారు కావడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X