»   » ట్విన్స్ పుట్టడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా: స్టార్ హీరోయిన్

ట్విన్స్ పుట్టడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా: స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మారై క్యారీ, నిక్ కెనాన్ ఇద్దరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. దానికి కారణం మారై క్యారీ ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడమే. మార్చి 6 వతేదీన మాంటెగ్ హోటల్‌లో జరిగినటువంటి ఫంక్షన్‌లో హోటల్ మొత్తం పింక్ రోజెస్, బ్లూ హైడ్రాన్జిస్ తోపాటు బెలూన్లతో కలకలలాడిపోయింది. మారై క్యారీ తనకు పుట్టినటువంటి ఇద్దరూ ట్విన్స్ (బాయ్ అండ్ గర్ల్) పుట్టిన సందర్బంగా తన స్నేహితులకు ఇచ్చిన పార్టీలో మారై క్యారీ ఎంతో ఆనందంగా గడిపారు.

ఈ ఫంక్షన్‌కి చాలా ముఖ్య అతిధులు హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా అమెరికా ఐడియల్ జడ్జి ర్యాండీ జాక్సన్ వచ్చి మారై క్యారీ, నిక్ కెనాన్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. తన పిల్లలను మారై క్యారీ ప్రత్యేకంగా చేతులతో తయారు చేసినటువంటి ఛైర్స్‌లో ఈ ఫంక్షన్‌కు తీసుకోని రావడం జరిగింది. ఈ సందర్బంలో మారై క్యారీ మాట్లాడుతూ నా జీవితంలో ఇలాంటి అద్బుతమైన ఘట్టాన్ని ఇంతవరుకు చూడలేదన్నారు. అది మాత్రమే కాకుండా దేవుడు నాకు ప్రసాదించినటువంటి అద్బుతమైన గిప్ట్స్‌గా భావిస్తున్నానని అన్నారు.

English summary
Mariah Carey and Nick Cannon celebrated the impending arrival of their twins - a boy and a girl – on Sunday (Mar. 6) with a blue and pink themed baby shower in Beverly Hills. The Montage Hotel''s Conservatory Grill was filled with pink roses and blue hydrangeas, as well as balloons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu