twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిషన్: ఇంపాజిబుల్ 7 యూనిట్‌లో కరోనా కలకలం: 14 మందికి కోవిడ్19 పాజిటివ్!

    |

    హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్‌ చిత్ర యూనిట్‌ను కరోనావైరస్ వెంటాడింది. చిత్ర యూనిట్‌లో కొందరు సభ్యులు, టెక్నిషియన్లకు కోవిడ్19 పాజిటివ్ అనే తేలింది. దాంతో షూటింగ్ వాయిదా వేసినట్టు పారమౌంట్ పిక్చర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఎంత మందికి కరోనావైరస్ సోకిందనే విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం. అయితే టామ్ క్రూయిజ్‌కు కరోనావైరస్ సోకలేదని హాలీవుడ్ పత్రిక సన్ వెల్లడించింది.

    మిషన్: ఇంపాజిబుల్ 7 తాత్కాలికంగా జూన్ 14వ తేదీ వరకు షూటింగును వాయిదా వేశాం. రెగ్యులర్‌గా కరోనావైరస్ టెస్టులు నిర్వహించే క్రమంలో కొందరికి పాజిటివ్ తేలింది. అయితే షూటింగు ప్రాంతంలో కోవిడ్ 19 ప్రోటోకాల్స్ అనుగుణంగా సురక్షిత చర్యలు తీసుకొంటున్నాం. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని పారమౌంట్ పిక్చర్స్ వెల్లడించింది.

     Mission: Impossible 7 unit members tested Coronavirus positive

    మిషన్: ఇంపాజిబుల్ 7 షూటింగులో భాగంగా నైట్ క్లబ్‌ సీన్ చిత్రీకరణ సందర్భంగా దాదాపు 14 మంది సభ్యులకు కరోనావైరస్ పాజిటివ్‌ అని తేలింది. దాంతో వారిని 14 రోజులు క్వారంటైన్‌కు తరలించారు అని హాలీవుడ్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

    హాలీవుడ్‌లో మిషన్: ఇంపాజిబుల్ సిరీస్‌ అత్యంత భారీ బడ్జెట్, అత్యంత ఆదరణ ఉన్న అతిపెద్ద ఫ్రాంచైజీ. ఈ సిరీస్‌లో ఏడవ చిత్రంగా వస్తున్న చిత్రం వెనీస్, ఇటలీ, నారవే, ఇటలీ, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రం మే 2022లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

    English summary
    Hollywood Super star Tom Cruise's Mission: Impossible 7 unit members tested Coronavirus positive. Paramount Pictures announced that Shooting was cancelled due to Coronavirus threat to unit members. Few members are testest positive
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X