»   » ఫేస్ బుక్ లో పిచ్చిరాతలతో ఇరుక్కున్న అందాల నటి, మహిళా జైలుకు తరలింపు

ఫేస్ బుక్ లో పిచ్చిరాతలతో ఇరుక్కున్న అందాల నటి, మహిళా జైలుకు తరలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మయన్మార్: సోషల్ మీడియా సైట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తప్పు మాట్లాడినా తిప్పలు తప్పేటట్లు లేవు. ముఖ్యంగా సెలబ్రెటీలకు ఈ సామాజిక మాధ్యమాలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో ..అంతగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇందుకు ఏ ప్రాంతమూ, దేశమూ అతీతం కాదు. అందుకు తాజాగా ఉదాహరణ..
సామాజిక మాధ్య‌మాల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేయ‌డంతో మయన్మార్‌ బ్యూటీ (ట్రాన్స్‌జెండర్‌) మ్యోకోకోసాన్‌ అరెస్ట్ అని చెప్పాలి.

మ్యోకోకోసాన్‌ ను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పోస్టుల‌తో పాటు ఆమె అసభ్యకరమైన పదజాలం ఉపయోగించింద‌ని పోలీసులు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..పాపులర్‌ నటిగా దూసుకుపోతున్న మయన్మార్‌ బ్యూటీ (ట్రాన్స్‌జెండర్‌) మ్యోకోకోసాన్‌ అరెస్టయింది. థాయిలాండ్‌ ట్రిప్ నుంచి తిరిగొస్తున్న ఆమెను విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు.

సోషల్‌ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టడంతోపాటు కొంత అసభ్యకరమైన పదజాలం ఉపయోగించందనే ఆరోపణల కిందట అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఆమెను యాంగన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నపోలీసులు ప్రస్తుతం మహిళల జైలులో ఒంటరిగా ఉంచి విచారణ చేస్తున్నారు.

Myanmar actress sues transgender beauty queen for defamation

ఈ నెలాఖరుకి అది పూర్తయ్యే అవకాశం ఉంది. టెలీకమ్యునికేషన్‌ చట్టం ప్రకారం సెక్షన్‌ 66(డీ)కింద ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. వుట్‌ మోన్‌ యీ అనే వ్యక్తిని అవమానించేలా ఆమె ఫేస్‌బుక్‌ ఇతర సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా సందేశాలు పెట్టిందట.

లింగమార్పిడి చేసుకున్న తర్వాత థాయిలాండ్‌ లో జరిగిన ట్రాన్స్‌జెండర్‌ మిస్‌ ఇంటర్నేషనల్‌ క్వీన్‌ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని తొలిస్థానాన్ని దక్కించుకుని ఈమె 2015లో ఫేమస్‌ అయ్యారు. అప్పటి నుంచి తొలుత సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు.

English summary
Myo Ko Ko San, an idol to Myanmar's small gay and transgender community, was arrested when she landed at Yangon International Airport on Tuesday after returning from a trip to Thailand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu