Cannes 2022 రెడ్ కార్పెట్‌పై నగ్నంగా మహిళ నిరసన.. మహిళలపై రేప్‌లను ఆపండి సంచలనం

ప్రతిష్టాత్మక 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తారల తళుకుబెళుకులు కొనసాగుతున్నాయి. ఫ్రెంచ్ రివీరాలో సందడి కొనసాగుతున్నది. కేన్స్ 2022 రెడ్ కార్పెట్‌పై భారతీయ సినీ తారలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, మీరా చోప్రా, దీపిక పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలను నిరసిస్తూ ఓ మహిళ నగ్నంగా రెడ్ కార్పెట్‌పై తన ఆక్రందనను వ్యక్తం చేసి సంచలనం రేపారు. కేన్స్‌కు సంబంధించిన తాజా వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ నటి మీరా చోప్రా నటించిన తాజా చిత్రం సేఫ్ట్ (Safed) సినిమా ప్రమోషన్ కేన్స్‌లో వైభవంగా జరిగాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కేన్స్ వేదికపై ఆవిష్కరించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

 Naked Women protest with slogan Stop Rapes in Ukraine at Cannes 2022 red carpet

కేన్స్ 2022 వేడుకలు, సినిమాల ప్రదర్శన విభాగంలో జ్యూరీగా వ్యవహరిస్తున్న దీపిక పదుకోన్ తన అందచందాలతో ఆకట్టుకొన్నారు. అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య ముగ్గురు ఫ్రెంచ్ రివీరాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు.

కేన్స్‌ 2022 వేడుకల్లో తారల సందడి ఓ వైపు బ్రహ్మండంగా జరుగుతుండగా.. ఉక్రెయిన్‌లో మహిళలపై జరుగుతున్న మానబంధాలు, అత్యాచారాలపై ఓ మహిళ నిరసన వ్యక్తం చేశారు. నగ్నంగా మారిన ఓ మహిళ రెడ్ కార్పెట్‌పైకి పరుగెత్తుకొంటూ వచ్చి.. ఉక్రెయిన్‌లో మహిళలపై రేప్‌లను ఆపండి.. అంటూ మహిళ తన ఆక్రందనను వ్యక్తం చేసింది. నగ్నంగా మహిళ రెడ్ కార్పెట్‌పైకి రావడంతో ఊహించని పరిణామంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ మహిళను కవర్ చేసి అక్కడి నుంచి బయటకు లాక్కెల్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X