twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెటిఫ్లిక్స్‌కు ఎదురుదెబ్బ.. అంత నీచమా? సినిమాపై దుమ్మెతిపోసిన నెటిజన్లు

    |

    ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఆన్‌లైన్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌కు ఎదురుదెబ్బ తగిలించింది. వివాదాస్పద ఫ్రెంచ్ చిత్రం క్యూటీస్‌ చిత్రానికి సంబంధించిన ప్రోమోలను ప్రసారం చేయడంపై పెద్ద ఎత్తున నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో నెట్‌ఫ్లిక్స్ క్షమాపణలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ఆ సినిమాపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమయ్యాయంటే...

     నెట్‌ఫ్లిక్స్‌లో క్యూటీస్ మూవీ ప్రోమో

    నెట్‌ఫ్లిక్స్‌లో క్యూటీస్ మూవీ ప్రోమో

    నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఫ్రెంచ్ చిత్రం క్యూటీస్ ఒరిజినల్ పేరు మిగ్నోన్నెస్. ఈ సినమిా కథలోకి వెళ్తే.. 11 ఏళ్లలోపు అమ్మాయిలు తమ తల్లిదండ్రులను ఎదురించి స్వేచ్ఛాయుత, లైంగిక జీవనం సాగించే డ్యాన్స్‌ బృందంలో చేరుతారు. అందులో అమ్మాయిల విచ్చలవిడి తత్వంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రానికి సండెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డైరెక్టర్ అవార్డు లభించింది.

     క్యూటీస్ ప్రోమోపై నెటిజన్ల ఆగ్రహం

    క్యూటీస్ ప్రోమోపై నెటిజన్ల ఆగ్రహం

    టీనేజ్‌‌ వయసులో లేని అమ్మాయిలతో అసభ్య, అశ్లీల సన్నివేశాలు, కథాంశంతో రూపొందించడంపై భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అర్ధనగ్నంగా 11 ఏళ్ల లోపు అమ్మాయిలను చూపించడాన్ని నిరసిస్తూ దారుణం, నీచంగా మహిళలను, బాలికలను చూపిస్తారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఈ సినిమా ప్రోమోలపై నిరసన వ్యక్తం ఆన్‌లైన్ సంతకాల సేకరణతో హడలెత్తించారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ దిగివచ్చి క్షమాపణలు చెప్పింది.

    నెట్‌ఫ్లిక్స్ క్షమాపణలు చెబుతూ

    నెట్‌ఫ్లిక్స్ క్షమాపణలు చెబుతూ

    ప్రపంచవ్యాప్తంగా క్యూటీస్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నెట్‌ఫ్లిక్ స్పందిస్తూ.. అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌తో రూపొందిన క్యూటీస్ (మెగ్నోన్నెస్) చిత్రాన్ని ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకొన్నందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ సినిమా గురించి తప్పుడు సమాచారం ఇచ్చాం. ఫొటోలను కూడా మార్చి సినిమా కథ గురించి వాస్తవాలు వెల్లడిస్తాం అని నెట్‌ఫ్లిక్స్ తన ప్రకటనలో తెలిపింది.

     48 వేల మంది సంతకాలతో

    48 వేల మంది సంతకాలతో

    క్యూటీస్ చిత్రాన్ని తొలగించాలంటూ, ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు తీసివేయాలంటూ Thechange.org సంస్థ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. దాదాపు 49 వేల మంది నుంచి సంతకాలు సేకరించింది. నెట్‌ఫ్లిక్స్ సమాధానం చెప్పడంపై సంతృప్తి వ్యక్తం చేయని సంస్థ.. పోస్టర్, మూలకథను మార్చడంతో మా అభ్యంతరాలు తొలగిపోవు అని నిర్వాహకులు స్పష్టం చేశారు.

    English summary
    Netflix rendered apology over Cuties promo streaming on their plotform. Netfilx says that, We're deeply sorry for the inappropriate artwork that we used for Mignonnes/Cuties. It was not OK, nor was it representative of this French film which won an award at Sundance. We’ve now updated the pictures and description.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X