»   » ఆ నిర్మాత కామ పిశాచి: టాప్ హీరోయిన్లను సెక్స్ కోసం వేధించాడు!

ఆ నిర్మాత కామ పిశాచి: టాప్ హీరోయిన్లను సెక్స్ కోసం వేధించాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. కొందరు నిర్మాతలు, దర్శకుడు, హీరోలు.... తమ సినిమాల్లో నటించే హీరోయిన్లు, నటీమణులను లైంగింక వాంఛలు తీర్చాలంటూ వేధింపులకు గురి చేస్తుంటారని తరచూ వార్తలు వింటూనే ఉన్నాం.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్లోనూ ఇదే పరిస్థితి. చిన్న చితకా హీరోయిన్లు మాత్రమే కాదు...... ఏంజెలీనా జోలీ, గైనెత్ పాల్ట్రో లాంటి ప్రపంచ ప్రఖ్యాత హీరోయిన్లకు సైతం లైంగిక వేధింపులు తప్పలేదు.

ఆ నిర్మాత కామ పిశాచి

ఆ నిర్మాత కామ పిశాచి

ప్రముఖ హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌ పెద్ద కామాంధుడు అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ ఆధారాలతో సహా ప్రచురించింది.

కామ పిశాచిని రోడ్డుకీడ్చారు

కామ పిశాచిని రోడ్డుకీడ్చారు


నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌ వల్ల లైంగిక వేధింపులు, రేప్‌కు గురైన ప్రముఖు హీరోయిన్లు, నటీమణులను ఇంటర్వ్యూ చేసిన వారు చెప్పిన సేట్మెంట్స్‌తో..... కామ పిశాచిని నడి రోడ్డుమీదకు ఈడ్చింది న్యూయార్క్ మేగజైన్.

ఏంజలీనా, గైనెత్ పాల్ట్రో

ఏంజలీనా, గైనెత్ పాల్ట్రో

వెయిన్‌స్టన్‌ చేతిలో లైంగిక వేధింపులకు గురైన నటీమణులు అనేక మంది ఉన్నారని, వారిలో ప్రముఖ హాలీవుడ్‌ నటీమణులు ఎంజెలినా జోలి, గైనెత్‌ పాల్ట్రో కూడా ఉన్నారని ఆ మేగిజిన్‌ వెల్లడించడంతో హాలీవుడ్ ప్రపంచం విస్తుపోయింది. వెయిన్‌ స్టన్‌ సినిమాలో తమ కెరీర్‌ ఆరంభంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తన లైంగిక వాంఛలు తీర్చాలని వేధించాడని వారు మేగజైన్‌కు వివరించారు.

గైనెత్ పాల్ట్రో‌ను హోటల్ రూముకు పిలిచాడు

గైనెత్ పాల్ట్రో‌ను హోటల్ రూముకు పిలిచాడు

ప్రముఖ హాలీవుడ్ నటి గైనెత్ పాల్ట్రో 22 సంవత్సరాల వయసులో ఉన్నపుడు వెయిన్‌స్టన్ ‘ఎమ్మా' అనే సినిమాలో ఆమెను లీడ్ రోల్ గా తీసుకున్నాడు. సినిమా ప్రారంభానికి ముందు వర్క్ మీటింగ్ అని హోటల్ రూముకు పిలిచి పక్కలో పడుకోవాలని కోరాడట. తన కోరిక తీరిస్తే నీ కెరీర్ బావుండేలా చేస్తా, అకాడెమీ అవార్డుకు గెలిచేలా సహాయ పడతాను అని ఆపర్ ఇచ్చాడట. అపుడు ఆమె అతడి ఆఫర్ తిరస్కరించింది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదరించాడట. ఈ విషయాలన్నీ గైనెత్ పాల్ట్రో మేగజైన్‌కు వెల్లడించింది.

ఏంజెలీనా జోలీ..

ఏంజెలీనా జోలీ..

తాను యంగ్ ఏజ్ లో ఉన్నసమయంలో వెయిన్‌స్టన్ తో పనిచేసే సమయంలో లైంగికంగా వేధించాడు. అపుడే మళ్లీ అతడితో పని చేయకూడదని నిర్ణయించుకున్నాను అని ఏంజెలీనా జోలీ ఈమెయిల్ ద్వారా మేగెజైన్‌కు వెల్లడించింది.

ఆ రాజకీయ పార్టీ అండతో...

ఆ రాజకీయ పార్టీ అండతో...

ఈ నిర్మాతకు అమెరికాలో పెద్ద పార్టీ అయిన డెమొక్రటిక్‌ పార్టీ మద్దతు ఉంది. ఎందుకంటే వెయిన్‌స్టన్‌ ఎప్పటి నుంచో ఈ పార్టీకి పెద్ద విరాళదాతగా ఉన్నాడు. ఆయనపై గతంలో ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా డెమొక్రాట్లు ఆయనకు సపోర్టుగా నిలిచేవారు. తాజాగా అతడి బండారం ఆధారాలతో సహా బయట పడటంతో ఆ పార్టీ కూడా ఇబ్బందుల్లో పడింది.

ఒబామా కూతురు ఇతడి వద్దే ఇంటర్న్‌షిప్

ఒబామా కూతురు ఇతడి వద్దే ఇంటర్న్‌షిప్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూతురు మాలియా కూడా ఈయన వద్దే ఇంటర్న్‌షిప్‌ చేసింది. ఇలాంటి నీచుడి వద్ద తమ కూతురు ఇంటర్న్ షిప్ చేసిందా అని వారు కూడా అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది.

English summary
Gwyneth Paltrow, Angelina Jolie and Others Say Weinstein Harassed Them. “This way of treating women ends now,” Ms.Paltrow said as she and other actresses accused the producer of casting-couch abuses. “I had a bad experience with Harvey Weinstein in my youth, and as a result, chose never to work with him again and warn others when they did,” Ms. Jolie said in an email.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu