Don't Miss!
- News
టర్కీలో తీవ్ర భూకంపం.. నిముషాల వ్యవధిలో రెండుసార్లు; రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు!!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Will Smith: చెంపదెబ్బ తర్వాత విల్ స్మిత్ సంచలన నిర్ణయం.. ఆస్కార్ అవార్డు పోయినట్లేనా!
సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అయితే, రెండేళ్లుగా కరోనా ప్రభావం కారణంగా ఇది సాదాసీదాగా జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 94వ అకాడమీ అవార్డుల కార్యక్రమాన్ని గత ఆదివారం భారీ స్థాయిలో నిర్వహించారు.
లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకలో ఊహించని సంఘటన జరిగింది. ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్ స్మిత్.. ప్రజెంటర్ క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ విషయంలో విల్ స్మిత్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

క్రిస్ రాక్‌ను కొట్టేసిన విల్ స్మిత్
94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఓ సందర్భంలో ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్ స్మిత్ భార్యపై జోక్ చేశాడు. దీంతో అతడు స్టేజ్ మీదకు దూసుకొచ్చి మరీ అతడి ముఖంపై పిడిగుద్దు గుద్దేశాడు.
Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

నా భార్య పేరు తీయొద్దు అంటూ
క్రిస్ రాక్ వేసిన జోక్‌కు విల్ స్మిత్ నవ్వుతూనే కనిపించాడు. కానీ, ఆ తర్వాత అతడు స్టేజ్ మీదకు దూసుకొచ్చి అతడిని కొట్టాడు. అయితే, ఇదంతా ఫన్నీగా జరిగిందని అంతా అనుకున్నారు. కానీ, కిందకు వెళ్లిన తర్వాత విల్ స్మిత్.. క్రిస్ రాక్ వైపు సీరియస్‌గా చూస్తూ ‘నీ ఫ** నోటి నుంచి నా భార్య పేరు రావొద్దు' అంటూ గట్టిగా అరవడంతో ఇది సీరియస్ అని తెలిసింది.

హాలీవుడ్ స్టార్‌పై విమర్శల వర్షం
అప్పటి వరకూ సరదాగా సాగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో విల్ స్మిత్ చెంపదెబ్బ ఘటన సంచలనం అయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న కార్యక్రమంలో మరో వ్యక్తిపై దాడి చేయడంతో ఈ హాలీవుడ్ హీరోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్రిస్ రాక్ అభిమానులు అతడిపై దుమ్మెత్తి పోశారు. అదే సమయంలో క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు చేశారు.
స్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంట

ఆస్కార్ వెనక్కి తీసుకుంటారని
క్రిస్ రాక్‌ను ఆస్కార్ స్టేజ్‌పై విల్ స్మిత్ కొట్టడం చర్చనీయాంశం అయింది. దీంతో అకాడమీ నియమ నిబంధనల ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో విల్ స్మిత్ గెలుచుకున్న ఆస్కార్ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపించాయి. దీంతో అతడు అవార్డును కోల్పోయే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది.

విల్ స్మిత్ సంచలన నిర్ణయం
క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టిన ఘటన తర్వాత మనస్థాపానికి గురైన హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ తాజాగా ఫిల్మ్ అకాడమీకి రాజీనామా చేశాడు. ఈ మేరకు వదిలిన ప్రకటనలో ‘నేను ఆస్కార్ వేడుకలో ప్రవర్తించిన విధానం షాకింగ్‌గా, బాధాకరంగా అనిపిస్తోంది. అందుకే అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. దీన్ని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ పేర్కొన్నాడు.
ప్రియుడికి శృతి హాసన్ సర్‌ప్రైజ్: స్పెషల్ డేన ఆ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసి మరీ!

నమ్మకాన్ని వమ్ము చేశానంటూ
రాజీనామా సమయంలో విల్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘అకాడమీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాను. మిగిలిన ఆస్కార్ విజేతలందరూ ఎంతో సరదాగా సంబరాలు చేసుకుంటుంటే.. నేను మాత్రం ఈ ఘటన వల్ల నిరాశగా ఉన్నాను. ఇది నన్ను ఎంతగానో బాధిస్తోంది. అందుకే నేను అకాడమీ బోర్డు సభ్యత్వానికి రాజీనామాను చేస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు స్మిత్.
Recommended Video


ఎలాంటి చర్యకైనా సిద్ధమేనని
విల్ స్మిత్ తాజాగా పంపిన తన రాజీనామా లేఖలో ‘నా రాజీనామాను అంగీకరించడంతో పాటు నా చర్యకు బోర్డు విధించే ఎలాంటి శిక్షనైనా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాను' అంటూ పేర్కొన్నాడు. దీంతో విల్ స్మిత్ అందుకున్న ఆస్కార్ అవార్డును అకాడమీ వాళ్లు వెనక్కి తీసుకుంటారా? లేక తొలి తప్పుగా భావించి క్షమించి వదిలేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.