Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మడోనాకు కరోనాను ఎదురించే శక్తి.. మరో రకమైన పాజిటివ్‌తో
ప్రపంచ పాప్ దేవత మడోన్నాకు ఊరట లభించింది. అమెరికాలో కరోనావైరస్ విలయతాండవం చేస్తుంటే.. ఆమెకు ప్రాణాంతక వ్యాధిని ఎదురించే శక్తి దేహంలో ఉందనే విషయం తాజా నిర్ఱారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్నితన ఇన్సాటాగ్రామ్ టీవీ 14వ ఎడిషన్ క్వారంటైన్ డైరీ ద్వారా వెల్లడించింది.
ఇటీవల కరోనా గుర్తింపుకు సంబంధించి నిర్ణారణ పరీక్షలు చేయించుకొంటే దేహంలో యాంటీ బాడీస్ ఉన్నట్టు తెలిసింది. ఇక రేపటి నుంచి నేను లాంగ్ డ్రైవ్‌కు వెళ్తాను. ఇక ఎలాంటి భయం లేకుండా కారు అద్దాలు దించుకొని కొవిడ్ 19 ఉన్న గాలిని పీల్చుతాను. నాకు ఒక ఆశాకిరణం లభించింది అంటూ మడోన్నా తెలిపారు.

నాకు, నా అభిమానులకు గుడ్ న్యూస్. రేపట్నుంచి ఉదయమే లేచి.. ఢిఫరెంట్‌గా ఫీలవుతాను. కానీ మీరంతా జాగ్రత్తగా ఉండండి.. ఇంటి పట్టునే సురక్షితంగా ఉండటానికి చర్యలు తీసుకోండి అంటూ సందేశం పంపారు.
ఇటీవల మడోనా కరోనావైరస్ ఎదురించే వ్యాక్సిన్ కోసం జరుగుతున్న పరిశోధనకు అండగా నిలిచారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తోపాటు సహాయం అందిస్తానని ఇటీవల అధికారికింగా మడోన్నా ప్రకటించింది. ఫౌండేషన్ చేస్తున్న సేవకార్యక్రమాల నచ్చడం వల్లే వారితో భాగస్వామ్యమయ్యానని చెప్పారు.
అయితే ఏ వ్యక్తి దేహంలో యాంటీ బాడీస్ ఉంటే కోవిడ్ 19 బారిన పడుతారా; లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ దేహంలో అలాంటి ప్రొటీన్స్ ఉంటే వైరస్‌తో పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది అని సెంటర్స్ ఫర్ డీసీసీ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ అమెరికా తెలిపింది. రోగ నిర్ధారక శక్తికి సమానంగా యాంటీబాడీస్ ఉంటాయా? అనేది ఇంకా ధృవీకరించాల్సిన విషయమని అన్నారు.
ఇప్పటికే హాలీవుడ్‌లో ఇద్రిస్ ఎల్బా, ఆండీ కెహెన్, టామ్ హాంక్స్, రిటా విల్సన్ లాంటి సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.