twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికా ప్రథమ పౌరురాలి రేసులో టాప్ హీరోయిన్.. శ్వేతభవనంలోకి అడుగు పెట్టేందుకు..

    |

    హాలీవుడ్ నటి, మోడల్, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, మీడియా పర్సనాలిటీ కిమ్ కర్దాషియాన్ పేరు అమెరికా ప్రథమ మహిళ రేసులోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. కిమ్ కర్దాషియాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది. త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుబోతుండటంతో కిమ్ పేరు మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. అమెరికా ప్రథమ మహిళగా కిమ్ కర్దాషియాన్ పేరు ఎందుకు వచ్చిందంటే..

    ట్రంప్‌తో పోటీకి కాన్యే వెస్ట్ పేరు

    ట్రంప్‌తో పోటీకి కాన్యే వెస్ట్ పేరు

    అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో ప్రస్తుత ప్రసిడెంట్ ట్రంప్‌కు వ్యతిరేకంగా కాన్యే ఒమారి వెస్ట్ పేరు అనూహ్యంగా రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. హాలీవుడ్‌లో ర్యాపర్, గాయకుడిగా, గేయ రచయితగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా కాన్యేకు మంచి ప్రజాదరణ ఉంది. అయితే కాన్యేను స్వతంత్ర అభ్యర్థిగా పలువురు మద్దతు తెలపడంతో ఇప్పుడు యూఎస్ మీడియాలో చర్చకు దారి తీసింది.

    ట్రంప్‌కు కాన్యే వీరాభిమానిగా

    ట్రంప్‌కు కాన్యే వీరాభిమానిగా

    ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌కు కాన్యే వెస్ట్ వీరాభిమాని. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు. కొద్ది నెలల క్రితం భార్య కిమ్ కర్దాషియాన్‌తో కలిసి వైట్ హౌస్‌ను సందర్శించి ట్రంప్‌ను కలుసుకొన్నారు. అమెరికా అభివృద్ధి పలు అంశాలపై చర్చించారు. ఇక మారిన పరిస్థితుల్లో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్, డెమాక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌కు కాన్యే ప్రత్యర్థిగా మారబోయే అవకాశం ఉందానే చర్చ జరుగుతున్నది. ట్రంప్‌ను విపరీతంగా అభిమానించే కాన్యే పోటీకి సిద్దపడుతారా? అనేది చర్చనీయాంశమౌతుంది.

    ఎలాన్ మస్క్ సపోర్ట్‌తో

    ఎలాన్ మస్క్ సపోర్ట్‌తో

    కాన్యే వెస్ట్‌ను రాజకీయాల్లోకి, అధ్యక్ష పదవి ఎన్నికల పోరులోకి లాగేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెల్సా అధినేత ఎలాన్ మస్క్ ప్రయత్నించడం విశేషంగా మారింది. కాన్యే వెస్ట్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని ట్వీట్ చేయడం అమెరికా రాజకీయాలు ఓ కుదుపుకు లోనయ్యాయి. దాంతో కాన్యే వెస్ట్‌తో పాటు ఆయన భార్య కిమ్ కర్దాషియన్ పేరు ఈ వ్యవహారంలో ట్రెండింగ్‌గా మారింది. అయితే కాన్యే మనసులో ఏముందో అనే విషయం ఇంకా బయటి రాకపోవడం గమనార్హం.

    ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా కిమ్

    ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా కిమ్

    రాబోయే రోజుల్లో అంతా సవ్యంగా జరిగితే హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ అమెరికా ప్రథమ పౌరురాలిగా మారే అవకాశం ఉంది. ఆమె భర్త కాన్యే వెస్ట్ పేరు ఇప్పుడు అనూహ్యంగా అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాన్యే వెస్ట్ పోటీలో నిలిస్తే పలువురు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడిగా కాన్యే విజయం సాధిస్తే కిమ్ కర్దాషియాన్ వైట్‌ హౌస్‌లో అడుగుపెట్టడం ఖాయం. అమెరికా ఫస్ట్ లేడిగా కిమ్ కర్దాషియాన్ పేరు మారుమోగడం ఖాయం అనే కామెంట్లు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

    Recommended Video

    KL Rahul Opened Up On His Relationship || Filmibeat Telugu
    కిమ్ కర్దాషియాన్‌కు మూడో భర్తగా

    కిమ్ కర్దాషియాన్‌కు మూడో భర్తగా

    హాలీవుడ్‌లో కిమ్ కర్దాషియాన్‌కు అత్యంత ప్రజాదరణ ఉంది. ఆమెకు కాన్యే వెస్ట్ మూడో భర్త. అంతకు ముందు రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాయి. డామన్ థామస్‌తో మొదటి పెళ్లి జరిగింది. వారిద్దరి కాపురం 2000 నుంచి 2004 వరకు సాగింది. ఆ తర్వాత క్రిస్ హంప్‌ఫైరెస్‌తో రెండో వివాహం జరిగింది. అయితే వారి దాంపత్య జీవితం 2011 నుంచి 2013 వరకు మాత్రమే సాగడం జరిగింది. 2014లో కాన్యే వెస్ట్‌ను కిమ్ మూడో వివాహం చేసుకొన్నది.

    English summary
    US Rapper Kanye West is running for president which could make kim kardashian the first lady. Telsa CEO Elon Musk supporting Kanye West candidature for US president post. While supporting Kanye, Elaon Musk tweeted that. "You have my full support!".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X