»   » నేను మరలా మీ ముందు నిల్చోవడానికి కారణం అభిమానులే...

నేను మరలా మీ ముందు నిల్చోవడానికి కారణం అభిమానులే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి డిస్ని స్టార్ డెమి లోవాటా ఇటీవల తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆన్ లైన్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో డెమి లోవాటా మట్లాడుతూ అభిమానులే తనకు బలం అని అన్నారు. అంతేకాకుండా తన రిహాబ్‌కు వెళ్శిన కూడా తన అభిమానులు తన వెన్నంటే ఉండి వారు ఇచ్చినటువంటి సపోర్టు ఎప్పటికీ మరువలేదని ఆ వీడియోలో పేర్కోనడం జరిగింది.

నాకు మాదిరే బాధ పడే వారి కోసం ఏదో ఒక్క రోజు మనం అంతా కలసి ప్రజలలో ఎవేర్‌నెస్ తీసుకురావడానికి సహాయపడాలని అన్నారు. డెమి లోవాటా రిహాబ్‌కు వెళ్శడానికి కారణం గత అక్టోబర్‌లో తన శరీరంలో వచ్చినటువంటి కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ అని మన అందరికి తెలిసిందే. నా జీవితంలో నేను రిహాబ్‌లో ఉన్న కొన్ని నెలలు నాకు చీకటి రోజులుగా ఉండిపోయాయని తన అభిమానులతో చెప్పారు.

ఆ సందర్బంలో అభిమానులు నాకు అనునిత్యం నేను త్వరగా కోలుకోవాలని పడిన తపన, వాళ్శు నాకు పంపించినటువంటి ట్వీట్స్, లెటర్స్ నన్ను ఎంతగానో సంతోషపెట్టాయి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఈరోజు ఇలా మీముందు మాట్లాడడానికి కారణం నా అభిమానులేనని స్పష్టంగా తెలియజేస్తున్నాను అని అన్నారు.

English summary
Disney Star Demi Lovato has reached out to fans to talk about “the darkest time” of her life in a new online video. The 18-year-old filmed a personal message to her fans over the weekend thanking them for all their support and assuring them she would soon be returning to work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu