For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పిల్లలకు క్రిస్మస్ కానుక 'రైజ్‌ ఆఫ్‌ ద గార్డియన్స్‌'

  By Srikanya
  |

  ముంబై: 3డిలో రూపొందిందిన పిల్లల యానిమేషన్ చిత్రం 'రైజ్‌ ఆఫ్‌ ద గార్డియన్స్‌'. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో 'మేజిక్స్‌'కి ఫాంటసీ కూడా జోడించారు. విలియం జోయ్సీ రాసిన 'ద గార్డియన్స్‌ ఆప్‌ చైల్డ్‌ హుడ్‌' పుస్తకం, 'ది మేన్‌ ఇన్‌ ద మూన్‌' అనే లఘుచిత్రం ఆధారం చేసుకుని పీటర్‌ రేమ్సే దర్శకత్వంలో క్రిస్టినా స్టీయిన్‌బర్గ్‌, నాన్సీబెర్న్‌ స్టీన్‌ నిర్మించారు.

  శత్రుఘ్న సిన్హా గారాల పట్టి, 'దబాంగ్' సోనాక్షి సిన్హా త్వరలో 'రైజ్ ఆఫ్ గార్డియన్స్ 'అనే చిత్రానికి వాయిస్ ఇవ్వనుంది. ఈ ఏనిమేషన్ చిత్రం హిందీలోకి డబ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె వాయిస్ తో ప్రధానపాత్రకు డబ్బింగ్ చెప్పించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. డ్రీమ్ వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.

  బాధ్యతలేకుండా నియమ నిబంధనలు పట్టించుకోకుండా తన సంతృప్తికోసం, సరదా కోసం అనుచరుల ద్వారా 'వింటర్‌ మేజిక్‌' ప్రదర్శనలు ఏర్పాటు చేసి తను ఆనందించే, వీక్షకులను సంతోషపెట్టే టీనేజ్‌ కుర్రవాడైన జాక్‌ ఫ్రాస్ట్‌ కథ ఇది. అలా 'వింటర్‌ మ్యాజిక్‌' కొనసాగిస్తుండగా ప్రపంచాన్ని చీకటిలోనే ఉంచాలని తలచే నైట్‌ మేర్‌కింగ్‌, ఆయనకు సంబంధించిన పిచ్‌ చేసే ప్రయత్నాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు జాక్‌ ఫ్రాస్ట్‌ బృందం. ఆ సమయంలో నార్త్‌ పోల్‌లో వుండే అద్భుతాల సంరక్షకుడు, అలాటి సంరక్షకులకు నాయకుడైన శాంతాక్లాస్‌, ఆశల సంరక్షకుడైన ఈస్టర్‌ బన్నీ, జ్ఞాపకాల సంరక్షకుడైన టూత్‌ ఫెయిరీ కలసి ప్రపంచంలోని పిల్లలందర్నీ నైట్‌మేర్‌ ఆలోచనలను సాకారం చేయతలపెట్టే పిచ్‌ నుంచి రక్షించడానికి తమతో కలవమని, తమకు సహాయం చేయమని రికామిగా వ్యవహరించే జాక్‌ ఫ్రాస్ట్‌ని కోరతారు. దాంతో వింటర్‌ మేజిక్‌నే లక్ష్యంగా పెట్టుకున్న జాక్‌ ఫ్రాస్ట్‌ నిర్వహించేవన్నీ ఆసక్తి కలిగిస్తాయి.

  జాక్‌ ఫ్రాస్ట్‌గా క్రిస్‌పైన్‌, శాంతాక్లాస్‌గా ఆలెక్‌ బాల్‌డ్విన్‌, ఈస్టర్‌ బన్నీగా హాగ్‌ జాక్‌మేన్‌, జ్ఞాపకాల సంరక్షకుడు టూత ఫెయిరీగా ఇస్లాఫిషర్‌, పిచ్‌గా జూడ్‌ లా నటించారు. డకోటా గోయో, ఖయానీ గ్రిప్ఫన్‌, డామ్నిక్యూ గ్రండ్‌ ఇతర పాత్రధారులు. స్వప్న సంరక్ష కుడైన సాండీ (సాండ్‌మేన్‌) మౌనంగానే వుంటూ చెప్పదలుచుకున్న విషయాన్ని ఇసుకతో చేసిన బొమ్మల ద్వారా వివరించడం ఒక ఆకర్షణ.

  ఈ అక్టోబర్‌ 22న జరిగిన జాతీయ హాలీవుడ్‌ చలనచిత్రోత్సవంలో 'బెస్ట్‌ యానిమేటెడ్‌' చిత్రంగా, మిల్‌ వ్యాలీ ఫిలిం ఫెస్టివల్లో 'ఆడియాన్స్‌ ఫేవరెట్‌ చిల్డ్రన్స్‌ ఫిలిం'గా అవార్డులు దక్కించుకుంది. డ్రీమ్‌ వర్క్స్ యానిమేషన్‌ సంస్థ నిర్మించిన రైజ్‌ ఆఫ్‌ ద గార్డియన్స్‌'కి సంగీతం అలెగ్జాండర్‌ డెస్‌ప్లాట్‌, కూర్పు జోయ్సీ ఎర్రాస్టియా, స్క్రీన్‌ప్లే డేవిడ్‌ లిండ్సే, అబైర్‌ సమకూర్చారు. 1గంట 37 నిముషాల సేపు ప్రదర్శితమయ్యే ఈ చిత్రం నిర్మించడానికి 145 మిలియన్‌ డాలర్లు ఖర్చు అయింది.

  English summary
  Dream Works Animation's "Rise of the Guardians" will release in India around Christmas. It is set in the backdrop of five guardian angels coming together to save the world. It has five key characters - Santa, Tooth Fairy, Pixie Dust, Sandman and Easter Bunny. Sonakshi is being considered to give voice over to the Tooth Fairy's role, a source said. The movie will be released in India by Viacom18 Motion Pictures.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X