»   » ప్రాణాలు కాపాడిన స్నేహం: ఫ్రెండ్ కోసం కిడ్నీ దానం చేసిన హీరోయిన్

ప్రాణాలు కాపాడిన స్నేహం: ఫ్రెండ్ కోసం కిడ్నీ దానం చేసిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శరీరంలోని మెదడు, గుండె, కిడ్నీల వంటి అవయవాలను నాశనం చేసే 'లూపస్' అనే వ్యాధి సోకిన ప్రముఖ హాలీవుడ్ పాప్ గాయని సెలెనా గోమెజ్ కు, ఆమె బెస్ట్ ఫ్రెండ్, నటి ఫ్రాన్సియా రైసా కిడ్నీ దానమివ్వగా, ఇప్పుడామెను పలువురు సెలబ్రిటీలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఫ్రాన్సియాతో కలసి తాను బెడ్ పై ఉన్న దృశ్యాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న సెలెనా 'నా బెస్ట్‌ ఫ్రెండే నా ప్రాణం నిలిపింది' అని ఓ ట్వీట్ పెట్టింది. తక్షణమే కిడ్నీ శస్త్రచికిత్స నిర్వహించాల్సి వుంటుందని, లేకుంటే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో, విషయం తెలుసుకున్న ఫ్రాన్సియా కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

కీలక అవయవాలు పాడై పోయే ప్రమాదం

కీలక అవయవాలు పాడై పోయే ప్రమాదం

సెలెనా గోమెజ్‌కు లూపస్ అనే వ్యాధి సోకింది. దాని కారణంగా ఆమె శరీరంలో కీలక అవయవాలు పాడై పోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరించారు. వెంటనే కిడ్నీ ఆపరేషన్ చేస్తే ప్రమాదం నుంచి సేవ్ అవ్వొచ్చిన డాక్టర్లు సూచించారు. ఇది విన్న సెలెనా ప్రాణ స్నేహితురాలు.. ప్రముఖ నటి ఫ్రాన్సియా రైసా కిడ్నీ దానం చేసింది. ఆపరేషన్ సక్సెస్ అయింది.

చాలా అనుమానాలున్నాయి

చాలా అనుమానాలున్నాయి

"కొంతకాలంగా నేను సైలెంట్‌గా ఉండటంపై నా అభిమానుల్లో చాలా అనుమానాలున్నాయి. నా కొత్త ఆల్బమ్ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ.. లూపస్ వ్యాధి వచ్చింది. శస్త్ర చికిత్స అయ్యాక కోలుకునేందుకు కొంత సమయం పట్టింది. నా కుటుంబ సభ్యులు, డాక్టర్స్‌కు థాంక్స్. ముఖ్యంగా ఫ్రాన్సియా నాకు అరుదైన బహుమతిగా కిడ్నీని ఇచ్చింది.

ఎప్పటికీ రుణపడి ఉంటా

ఎప్పటికీ రుణపడి ఉంటా

"ఆమె చేసిన త్యాగానికి ఎప్పటికీ రుణపడి ఉంటా" అంటూ సెలెనా ఫోటోతో పాటు ఓ మెసేజ్‌ని కూడా పోస్ట్ చేసింది. అంతేకాదు.. లూపస్‌ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన లింకును కూడా ఆమె పోస్ట్‌ చేసింది. సెప్టెంబర్ 14 ఉదయాన ఆమె తనకు జరిగిన ఆపరేషన్ గురించి తన ఫ్యాన్స్ కు చెప్పింది.

ఆసుపత్రి బెడ్ మీద

ఆసుపత్రి బెడ్ మీద

ఈ సమ్మర్ లో తాను సైలెంట్ గా ఎందుకు ఉన్నానో తెలిజేస్తూ ఆసుపత్రి బెడ్ మీద సెలెనా పడుకున్న ఫోటోలను అప్లోడ్ చేసింది. అలాగే ఆపరేషన్ జరిగినప్పుడు పడ్డ మచ్చను కూడా ఆమె చూపించింది. ఈ ఒక్క విషయంతో సెలెనా అభిమానులు తెగ కంగారు పడిపోయారు.

ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ అమెరికన్ టీనేజర్

ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ అమెరికన్ టీనేజర్

తన ప్రాణస్నేహితురాలు ఫ్రాన్సియా రైసా చేసిన సాయం గురించి కూడా చెప్పింది. ఫ్రాన్సియా రైసా ‘ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ అమెరికన్ టీనేజర్' అనే టీవీ షోలో కనిపించింది. అలాగే లూపస్ వ్యాధి గురించి అందరికీ తెలియజేసింది సెలెనా.. సెలెనా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షించారు.

English summary
Selena Gomez posted a photo on Instragram that shows her and fellow actress Francia Raisa holding hands across their hospital beds.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu