twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మృత్యువు ఒడిలో నుంచి అలా బయపడ్డా.. అప్పుల్లో కూరుకుపోయి రోడ్డుపైకి.. షెరాన్ స్టోన్ ధీనగాథ

    |

    హాలీవుడ్‌లో 80, 90వ దశకంలో సంచలన పాత్రలతో ఆకట్టుకొన్న శృంగారతార షెరాన్ స్టోన్ మరోసారి మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ అనే ఆత్మకథతో అభిమానుల ముందుకు వచ్చిన షెరాన్ స్టోన్.. సంచలన విషయాలను బయటపెట్టింది. అంతేకాకుండా తాను మరణం నుంచి ఎలా తప్పించుకొన్నాననే భావోద్వేగమైన విషయాన్ని మీడియాతో పంచుకొన్నారు. షెరాన్ చెప్పిన విషయాలు ఏమిటంటే...

     మెదడులో రక్తస్రావంతో

    మెదడులో రక్తస్రావంతో

    ప్రొఫెషనల్, పర్సనల్ వ్యవహారాలతో బిజీగా ఉన్న సమయంలో నాకు హఠాత్తుగా సెరెబ్రెల్ హేమరేజ్ గురయ్యాను. మెదడులో తీవ్రమైన పోటు రావడంతో ఆస్పత్రి పాలయ్యాను. దాదాపు మృత్యువు ఒడిలోకి చేరుకొన్నాననే ఫీలింగ్ అందరికి కలిగింది. మెదడులో రక్తస్రావం ఆగకపోతే తొమ్మిది రోజుల్లో మరణించడం ఖాయమని డాక్టర్లు తేల్చేశారు అని షెరాన్ పేర్కొన్నారు.

     చావు తప్పదనే నిర్ణయానికి..

    చావు తప్పదనే నిర్ణయానికి..

    డాక్లర్ల అభిప్రాయం తెలిసిన తర్వాత నాకు చావు తప్పదనే నిర్ణయానికి వచ్చాను. డాక్టర్లు ఆ మాట చెప్పగానే నేను ఉన్న హాస్పిటల్ రూమ్‌లో అంతా నిశ్శబ్దం ఆవరించింది. హాస్పిటల్ సిబ్బంది కూడా ఏమీ తోచక అలా నిలబడిపోయారు. ఆ క్రమంలో నేను ఉన్న పరిస్థితులు ఎంత తీవ్రతరంగా ఉన్నాయో అర్ధమైంది. చావు ఇక తప్పదనే నిర్ణయానికి వచ్చాను అని షెరాన్ చెప్పారు.

     అప్పుల్లో కూరుకపోయా.. ఇంటిని తాకట్టుపెట్టి..

    అప్పుల్లో కూరుకపోయా.. ఇంటిని తాకట్టుపెట్టి..

    నాలోని మానసిక స్థైర్యం నన్ను బతికించేలా చేసింది. అలాంటి పరిస్థితి నుంచి కోలుకోవడానికి నాకు ఏడేళ్లు పట్టింది. డబ్బు లేకపోవడంతో ఇంటిని తాకట్టు పెట్టాను. ఆ ఏడేళ్లలో సర్వం కోల్పోయాను. బిజినెస్‌లో నష్టాలు రావడంతో మరింత అప్పుల్లో కూరుకుపోయాను అని షెరాన్ స్టోన్ తెలిపారు.

     ప్రిన్స్ డయానా, నాకు విపరీతమైన పాపులారిటీ

    ప్రిన్స్ డయానా, నాకు విపరీతమైన పాపులారిటీ

    నేను తీవ్రమైన అనారోగ్యం బారిన పడటానికి ముందు నన్ను అందరూ అత్యంత శృంగార తారగా చూసే వాళ్లు. ఆ సమయంలో నాకు, ప్రిన్స్ డయానాకు విపరీతమైన పాపులారిటీ ఉండేది. ఆమె ప్రమాదంలో మరణిస్తే.. నాకు స్ట్రోక్ ద్వారా నేను పాపులారిటీని కోల్పోయాను. ఇప్పుడు అందరూ మమల్ని మరిచిపోయే పరిస్థితి వచ్చింది అని షెరాన్ స్టోన్ పేర్కొన్నారు.

    English summary
    Basin Instinct actress and Hollywood star Sharon Stone revealed her pathatic situations in life. She shared incidents after cerebral haemorrhage stroke in 2001. She said It take seven years from the stroke. She also said Business loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X