»   »  గుర్తు పెట్టుకోవాల్సిన లిస్ట్ :ఈ వేసవిలో రిలీజ్ అవుతున్న పిల్లలు సినిమాలు

గుర్తు పెట్టుకోవాల్సిన లిస్ట్ :ఈ వేసవిలో రిలీజ్ అవుతున్న పిల్లలు సినిమాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: స్కూల్స్ కు శెలవలు ఇచ్చేసారు. దాదాపు రెండు నెలలు పాటు పిల్లలు ఇల్లు పీకి పందిరి వేసే పోగ్రాం పెట్టుకుంటారు. పోనీ బయిటకు వెళ్లి అవుట్ డోర్ గేమ్స్ ఆడుకుంటారా అంటే సాయింత్రం ఎప్పటికో గానీ వాతావరణం చల్లబడటం లేదు.

మరి ఎంతసేపు అని పిల్లలు ఇంట్లో కూర్చుంటారు. అందుకే వారి కోసం పిల్లలు సినిమాలు సమ్మర్ లో రెడీ అవుతూంటాయి. పెద్దలు సైతం ఈ సమ్మర్ సినిమాలను తమ పిల్లలతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తూంటారు అనుకోండి. అంతెందుకు మొన్నటికి మొన్న జంగిల్ బుక్ సినిమాకు మీ పిల్లలను తీసుకు వెళ్లలేదూ.

తప్పదు..మీరు పిల్లలు సినిమాలు లిస్ట్ తీసుకుని ఈ సమ్మర్ కు ధియోటర్స్ దగ్గర క్యూ కట్టాల్సిందే. లేకపోతే పిల్లలు తమ ఫ్రెండ్స్ కు సమ్మర్ అయ్యిపోయాక ఏం చెప్పుకుంటారు. ప్రక్కింటి పిల్లలు తాము చూసి వచ్చిన జంగిల్ బుక్ గురించో, కుంగుఫూ పాండా 3 గురించో చెప్తూంటే మన పిల్లలు నోరు వెళ్లబెట్టుకు చూడాలా..అందుకే మీకు రెడీ రెకనర్ లా..ఈ సమ్మర్ లో వస్తున్న చిత్రాలు లిస్ట్ మీకు అందిస్తున్నాం...

స్లైడ్ షోలో..

హోమ్

హోమ్

ఈ యానిమేటెడ్ సినిమా ఖచ్చితంగా మీకు పూర్తి గా నవ్విస్తుంది. మీ పిల్లలకు అయితే కేరింతలు కొడతారు. ఈ చిత్రం కథ ఏమిటంటే...ఓ గ్రహాంతరవాసి...ఊహించని ప్లేస్ లో ఓ ఇంటిని చేరుతుంది. అక్కడ జరిగే సంఘటనలు ఫుల్ కామెడీతో సాగుతాయి.

పాన్

పాన్

పీటర్ పాన్ గురించి, టింకెర్ బెల్ గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఈ లైవ్ ఏక్షన్ సినిమాను మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. హ్యూజ్ జాకమన్..నల్లటి గెడ్డంతో అదరకొడతాడు..పీటర్ పాన్, అతని నెవర్ లాండ్ మూలం గురించి ఈ సినిమా చూపెడుతుంది.

Hotel Transylvania 2

Hotel Transylvania 2


ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ చూసి ఉంటారు. ఇందులో వాంపైర్స్, మానవ సంభంధాలు,తో ఓ పాజిటివ్ లుక్ తో ఫన్నీగా సాగుతుంది.ఈ సినిమా ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూస్తానని పట్టుబెడతారు మీ పిల్లలు ఖచ్చితంగా.

 The Spongebob movie: Sponge Out Of Water

The Spongebob movie: Sponge Out Of Water

హాలీవుడ్ చిత్రాలు రెగ్యులర్ చూసేవారికి ఈ పాత్రలు పరిచయమే. ఇప్పుడు మనం మన పిల్లలకు ఈ పాత్రలు పరిచయం చేయాల్సిన సమయం వచ్చింది. త్రీడి యానిమేషన్ లో కంప్యూటర్ ఏనిమేషన్ తో లైవ్ యాక్షన్ కామెడీతో ఈ సినిమా సాగుతుంది.

Inside Out

Inside Out


ఈ యానిమేటెడ్ సినిమా..ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు తెచ్చుకుంది. అకాడమి అవార్డు నామినేషన్స్ సైతం పొందింది. అవుట్ ఆఫ్ భాక్స్ ధింకింగ్ , మానవ మనస్తత్వం మీద ఓ ఇంట్రస్టింగ్ యాంగిల్ ని మనకు పరిచయం చేస్తుంది. ఈ సినిమా డాక్టర్స్ కు తమ పేషెంట్స్ తో కమ్యూనికేట్ చేయటం చెప్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే.

Minions

Minions

ఈ పసుపు పచ్చ అల్లరి ,దొంగమొహం జీవుల్ని ఎవరు ఇష్టపడరు. ఇవి కిడ్స్ కు చాలా ఇష్టమైనవి . ఈ ప్రాఛైజ్ మరోసారి మనల్ని ,మన పిల్లల్ని అలరించటానికి ఈ సమ్మర్ లో రెడీ అవుతోంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

English summary
we have just the right list of movies to watch with your kids this summer and beat the heat the smart way! Let's dive in!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu