Just In
Don't Miss!
- Lifestyle
వెన్నునొప్పిని తేలికగా తీసుకోకూడదని ఇక్కడ కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి!
- Automobiles
భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్!
- News
Kangana: దెబ్బకు హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్, మేడమ్ మాటలు నేర్చింది !
- Finance
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆస్కార్ గ్రహీత, ప్రముఖ నటుడు కన్నుమూత.. శోక సంద్రంలో సినీ లోకం
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు క్రిస్టఫర్ ప్లమ్మర్ ఇక లేరు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఆయన అనూహ్య పరిస్థితుల్లో తుదిశ్వాస విడిచారు. దాంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ పలువురు సోషల్ మీడియాలో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు.

తలకు గాయం కావడంతో
క్రిస్టఫర్ ప్లమ్మర్ మృతి వార్తను భార్య ఎలైన్ టేలర్ మీడియాకు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం కిందపడ్డారు. ఆ సమయంలో తలకు తీవ్ర గాయమైంది. దాంతో ఆయన కోలుకోలేకపోయారు అని తెలిపారు. క్రిస్టఫర్ వయసు 91 సంవత్సరాలు. ఆయన టొరొంటలో 1929, డిసెంబర్ 13వ తేదీన జన్మించారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో రేడియో, స్టేజ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ది స్టార్ క్రాస్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు.

సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రంతో
సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రమే కాకుండా క్రిస్టఫర్ ప్లమ్మర్ నటించిన ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్, ది లాస్ట్ స్టేషన్ అత్యంత ప్రేక్షదారణ పొందాయి. దాదాపు ఏడు దశాబ్దాలపాటు తన కెరీర్ కొనసాగించారు. క్రిస్టఫర్ ప్లమ్మర్ కెరీర్ చివరి వరకు అద్భుతంగా సాగింది. అవార్డులు, రివార్డులతో ఆయన సత్కరింపబడ్డారు

82 ఏళ్ల వయసులో ఆస్కార్ అవార్డు
2010లో క్రిస్టఫర్ ప్లమ్మర్ నటించిన బిగినర్స్ అనే చిత్రానికి ఆస్కార్ అవార్డు అందుకొన్నారు. అప్పుడు ఆయన వయసు 82 సంవత్సరాలు. అత్యధిక వయసులో ఆస్కార్ అందుకొన్న నటుడిగా ఆయన చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆయన నటించిన ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది. కానీ లైంగిక ఆరోపణల కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయారు.

వైవాహిక, వ్యక్తిగత జీవితంలో
క్రిస్టఫర్ ప్లమ్మర్ వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు. ఆయన తన జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకొన్నారు. మొదటి వివాహం నటి టామీ గ్రిమెస్‌తో జరిగింది. ఆమెతో వ్యక్తిగత విభేదాలు రావడంతో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత జర్నలిస్టు పాట్రిసియా లెవిస్ పెళ్లి చేసుకొన్నా ఎక్కువ కాలం దాంపత్య జీవితం కొనసాగలేదు. ఆ తర్వాత ఎలైన్ టైలర్‌ను వివాహం చేసుకొన్నారు. ఆయనకు గ్రిమెస్ ద్వారా కూతురు ఉంది.