For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రాబర్డ్‌ డి నీరో కామెడీ 'ద బిగ్ వెడ్డింగ్‌' రిలీజ్ డేట్

  By Srikanya
  |

  లాస్ ఏంజిల్స్: రాబర్డ్‌ డి నీరో తాజా చిత్రం 'ద బిగ్ వెడ్డింగ్‌' రిలీజ్ డేట్ వాయిదా పడింది. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయటానికి నిర్ణయించారు. అయితే కొన్ని టెక్నికల్ కారణాలు వల్ల ఈ చిత్రం వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలియచేసారు. ఈ చిత్రాన్ని బక్కెట్ లిస్ట్ ఫేమ్ జస్టిన్ జకామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి కామెడీగా రూపొందింది. అయితే ఈ చిత్రం ఓ ప్రెంచి చిత్రం రీమేక్ కావటం గమనార్హం. ఈ చిత్రాన్ని ఏప్రియల్ 26,2013 న విడుదల చేయనున్నారు.

  కథ ప్రకారం... అప్పటికే విడాకుల తీసుకున్న డాన్‌ గ్రిఫ్ఫన్‌గా (రాబర్డ్‌ డి నీరో) ఎల్లి గ్రిఫ్ఫిన్‌ (డయనా కెటన్‌) దంపతులు మధ్య జరుగుతుంది. విడాకులు తీసుకున్న ఈ జంటకు తమ కుమారుడు వివాహ విషయమై ఓ సమస్య వచ్చి పడుతుంది. వారిద్దరూ విడాకులు తీసుకోకుండా ఇంకా అన్యోన్యంగా గడుపుతున్న జంటలాగానే నటించి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి వైభవంగా జరపాలనే దంపతుల తాపత్రయం, హడావుడి, చేసే సంబరాలే 'ద బిగ్‌ వెడ్డింగ్‌' కథ. కొడుకు పెళ్లి వేడుకలు జరపడానికి ఇద్దరూ కలసిపోయి తాము విడాకులు తీసుకోకుండా దాంపత్య జీవితం గడుపుతూనే ఉన్నామని గ్రిఫ్సన్‌ కుటుంబ బంధువులు, స్నేహితులకు తెలిపే ప్రయత్నంలో పడ్డ పాట్లు ద్వారా చక్కని హాస్య చిత్రంగా రూపుదిద్దుకుంది. చివరకు ఈ విడాకులు తీసుకున్న ఈ జంట ఏం నిర్ణయం తీసుకున్నారనేది క్లైమాక్స్ లో వస్తుంది.

  ఇక ఈ చిత్రానికి మొదట 'ద వెడ్డింగ్‌' అనే టైటిల్‌ని నిర్ణయించారు. జీన్‌స్టెఫేన్‌ బ్రాన్‌, కరైన్‌ సుడాన్‌ కలసి రూపొందించిన ఫ్రెంచి చిత్రాన్ని ఇంగ్లీష్‌లో అమెరికన్‌ కామెడీ చిత్రంగా పునర్నిర్మించారు. జస్టిన్‌ జకామ్‌ దర్శకత్వంలో పూర్తిగా కుటుంబాలకు నచ్చే కామెడీగా రూపొందిందంటున్నారు. లైలా గ్రిఫ్ఫిన్‌గా కేథరిన్‌ హైల్‌, జేర్డ్‌ గ్రిఫ్ఫన్‌గా టోఫర్‌ గ్రేస్‌, అలాజాండ్రో గ్రిఫ్ఫన్‌గా బెన్‌ బార్సెన్‌, బెబ్‌ మెక్‌ బ్రైడ్‌గా సుసాక్‌ సరాండన్‌, ఫాదర్‌ మెనిగాన్‌గా రాబిన్‌ విలియమ్స్‌, ముప్ఫిన్‌ ఓ కాన్నార్‌గా క్రిస్టీన్‌ ఎబెర్‌సోల్‌, మిస్సీ ఓ కాన్నర్‌గా అమందా సెఫ్రీడ్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

  జస్టీన్‌ జకామ్‌ రచన, దర్శకత్వం నిర్వహించిన ఈ చిత్రాన్ని టూ టన్‌ ఫిలిమ్స్‌, మిలినియం ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అంథోని కటగాస్‌, క్లేపెకోరిన్‌, రిచర్డ్‌ సాల్వటోర్‌, హేరీ జె అఫ్లాండ్‌, జస్టిన్‌ జకామ్‌ నిర్మాతలు. ఛాయాగ్రహణం జొనాథన్‌ బ్రౌన్‌, సంగీతం నాథాన్‌ బార్‌, ఎడిటింగ్‌ జోన్‌ కార్న్‌ నిర్వహించారు. లయన్స్‌ గేట్స్‌ ద్వారా ఏప్రియల్ 26,2013 న ఆస్ట్రేలియా, నార్త్‌ అమెరికాలో ఈ చిత్రం విడుదల అవుతోంది.

  English summary
  "The Big Wedding," an all-star rom-com starring Diane Keaton, Robert De Niro, Susan Sarandon, Katherine Heigl, Amanda Seyfried, Ben Barnes, Robin Williams and Topher Grace, the directorial debut of "The Bucket List" writer Justin Zackham is no longer a 2012 release, as parent studio Lionsgate have moved it from the so-close-you-can-almost-taste-it date of October 26th, to the far-off distant lands of April 26th, 2013, a date that it has all to itself (although "Iron Man 3" hits a week later), and exactly six months from the original release date. It is set to be released on April 26, 2013 by Lionsgate in the United States and Canada.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more