»   » హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ రియల్ ఎరోప్లేన్‌ స్టంట్ (వీడియో)

హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ రియల్ ఎరోప్లేన్‌ స్టంట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు ఇస్టపడే వారికి ‘మిషన్ ఇంపాజబుల్' సిరీస్ చిత్రాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జేమ్స్ బాండ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజిలో ఉండే ఈ సిరీస్ చిత్రాల్లో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ అబ్బుర పరిచే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు.

ఈ సిరీస్ లో తాజాగ వస్తున్న చిత్రం ‘మిషన్ ఇంపాజబుల్-రోగ్ నేషన్'. 2011లో వచ్చిన ‘మిషన్ ఇంపాజబుల్-ఘోస్ట్ ప్రోటోకాల్'కు కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాలోనూ టామ్ క్రూయిజ్ మరోసారి ఉత్కంఠ పరిచే యాక్షన్ సన్నివేశాలతో అలరించబోతున్నారు.

ఈ సినిమా కోసం టామ్ క్రూయిజ్ కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసాడు. 5000 అడుగుల ఎత్తులో గాల్లో ఎగురుతున్న విమానాన్ని పట్టుకుని వేలాడుతూ రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఈ సీన్ చిత్రీకరణకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Ever since the trailer of Mission Impossible Rogue Nation released, we have been waiting to see how Tom Cruise performed the deadly airplane stunt. Months before the trailer dropped, pictures from the shoot went viral on social media as Tom Cruise who plays Ethan Hunt loves doing the stunts all by himself.
Please Wait while comments are loading...