»   » ఎప్పుడూ షోకే ప్రధాన ఆకర్షణగా నిలిచే వారిద్దరూ ఎందుకు రాలేదు..!?

ఎప్పుడూ షోకే ప్రధాన ఆకర్షణగా నిలిచే వారిద్దరూ ఎందుకు రాలేదు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచ ప్రఖ్యాతిగంచిన ఆస్కార్ అవార్డులకు హాలీవుడ్ తారాతోరణం అంతా తరలివస్తుంది. కొడాక్ థియేటర్లో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చిన వారి రెడ్ కార్పెట్ హొయలు చూడటానికి రెండు కళ్లు చాలవు అలాంటిది ఈ షోకు ప్రతీ ఏడాదీ ప్రధాన ఆకర్షణగా నిలిచే హాలీవుడ్ అందాల జంట బ్రాడ్ పిట్-ఏంజలీనా జోలీలు ఈ దఫా ఆస్కార్ అవార్డుల్లో కనిపించలేదు. ఇంతకీ వీరెమయ్యారు ఎందుకీ షోకు డుమ్మాకొట్టారు అని ఆరాతీస్తే వారిద్దరూ ప్రస్తుతం వెనీస్ లో వున్నారని తెలిసింది. ప్రస్తుతం ఏంజలీనా జోలీ నాయికగా నటిస్తున్న ది టూరిస్ట్ సినిమాలో బిజీగా వున్నడంతో వారిద్దరూ అక్కడే వున్నారు. అయితే షూటింగ్ లో బిజీగా వుండి రాలేకపోయారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆ రోజు వీరిద్దరూ తమ పిల్లల పుట్టిరోజును ఘనంగా జరుపుకున్నారు. తమకు అన్నింటి కన్నా పిల్లలే ఎక్కువ అని చెప్పడానికే వీరిద్దరూ ఆస్కార్ కు రాలేదని ఓ వర్గం సమాచారం.

కానీ బ్రాడ్ పిట్ నటించిన సినిమా 'ది ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్' సినిమా ఆస్కార్ ఉత్తమ చిత్రాల్లో పోటీకి నిలవగా బ్రాడ్ పిట్ కు ఉత్తమ నటుడి నామినేషన్ ఇవ్వలేదనే వీరిద్దరూ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఏదెలా వున్నా ఈ సారి రెడ్ కార్పెట్ పై ఏంజలీనా అందాలు లేక షో చిన్నబోయిందని చెప్పవచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu