For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ టెన్షన్‌తో నిద్రపట్టడం లేదు.. అలాంటి కోరిక ఎప్పుడూ లేదు.. అనసూయ

|

వినోద పరిశ్రమలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా రంగంలో తనదైన ముద్రను వేశారు. ఇటీవల ఆమె నటించిన క్షణం, రంగస్థలం, యాత్ర సినిమాలు మంచి పేరును తెచ్చాయి. నటిగా మంచి పేరు తెచ్చుకొంటున్న నేపథ్యంలో సింగిల్ హీరోయిన్‌గా కథనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కథనం సినిమా ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. అనసూయ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

హీరోయిన్ అవుతానని ఎన్నడూ అనుకోలేదు

హీరోయిన్ అవుతానని ఎన్నడూ అనుకోలేదు

సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లయింది. నేను ఎప్పుడు సినిమాల్లోకి వస్తానని గానీ, సింగిల్ పోస్టర్ హీరోయిన్‌గా అవుతానని కూడా అనుకోలేదు. హీరోయిన్‌గా అవ్వాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. సింగిల్ హీరోయిన్ అనేది బాధ్యత. సినిమా ప్రమోషన్ చూస్తుంటే ఆ బాధ్యత గుర్తొస్తుంది. రంగస్థలం సినిమా చేసినప్పుడు వాళ్లు చెప్పినట్టు చేసుకొంటూ పోయాను. చివరకు నా పాత్ర ప్రభావం ఏమిటనేది తెర మీద చూస్తేగానీ తెలియలేదు. అప్పటి నుంచి వచ్చిన అవకాశాన్ని కరెక్ట్‌గా చేయాలని నేర్చుకొన్నాను.

క్షణం తర్వాత చాలా ఆఫర్లు

క్షణం తర్వాత చాలా ఆఫర్లు

క్షణం సినిమా తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. రంగస్థలం నుంచి కథనం సినిమా వరకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ ఎందుకు అయ్యానని, సినిమాల్లోకి ఎందుకు వచ్చానని ఎన్నడూ అనుకోలేదు. కథనం మెయిన్ లీడ్ చేయడానికి ముందు చాలా కథలు విన్నాను. దాదాపు 13 స్టోరీలు విన్నాను. కథనం కథ విన్నప్పుడూ అది కరెక్ట్ అనే ఫీల్ అయ్యాను.

ఫిలిం డైరెక్టర్ పాత్రలో

ఫిలిం డైరెక్టర్ పాత్రలో

కథనం విషయానికి వస్తే నేనేంటో నిరూపించుకోవడానికి అవకాశం కలిగింది. రకరకాల ఎమోషన్స్ ఉండే పాత్ర. ఈ సినిమాలో నా పాత్ర పేరు అను. ఫిలిం డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఉంటాను. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా కథ రాసుకొని సినిమా తీస్తుంటే కొన్ని సమస్యల్లో ఇరుక్కుపోతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య నా పాత్ర ఎలా తన లక్ష్యాన్ని చేరుకొన్నదనే సినిమా కథ.

కథనం ప్రమోషన్ బరువు, బాధ్యతను

కథనం ప్రమోషన్ బరువు, బాధ్యతను

కథనం సింగిల్ హీరోయిన్ సినిమా కాబట్టి సవ్యంగా ప్రమోషన్ బాధ్యతను నా భుజాన వేసుకొంటున్నాను. ఇది నాపై కొంత భారమే అయినా.. దానిని పాజిటివ్‌గా తీసుకొంటున్నాను. ప్రేక్షకులకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే నాకు మాత్రం నేను ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తానా అనేది ఇంకా నాపై నాకే నమ్మకం లేదు. కానీ నా నిర్మాతలకు ఆ నమ్మకం ఉండే కథనం సినిమాను నాతో చేయించారు. రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే.

కథనంకు అన్ని సినిమా కష్టాలు

కథనంకు అన్ని సినిమా కష్టాలు

కథనం మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సినిమా కష్టాలు బాగానే పడ్డాం. నిర్మాతలు, దర్శకుడు, హీరోయిన్‌గా నేను, నాతోటి నటీనటులు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నాం. అవన్నీ తట్టుకొని మీ ముందుకు రావడమంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్‌కు ముందు టెన్షన్‌తో నిద్రపట్టడం లేదంటే నమ్మలేకపోయాను. ఇప్పుడు ఆ పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఈ సినిమాలో ధన్‌రాజ్, అవసరాల శ్రీనివాస్, రణధీర్, పెళ్లి పృథ్వీ, జ్యోతి, సమీర్ లాంటి వాళ్లకు మంచి పేరు వస్తాయనే నమ్మకం ఉంది.

English summary
Actor Anasuya Bharadwaj got good craze and name after Kshanam, Rangasthalam and Yatra. Now she is doing sole herone in Kathanam movie. Kathanam movie is set to released on August 10th. In this occassion, She spoke to Filmibeat exclusively.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more