For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలా నన్ను మోసం చేశాడు.. శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయా.. శ్యాం నాయుడిపై సాయిసుధ మండిపాటు

  |

  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు తనను చీటింగ్ చేశారంటూ వర్ధమాన నటి శ్రీ సాయిసుధ కేసు నమోదు చేయడం సినీ వర్గాల సంచలనం రేపింది. శ్యాం కే నాయుడుపై నమోదైన కేసు గురించి హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి సుధ, శ్యాం కే నాయుడు మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందనే విషయాన్ని మేం పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సాయి సుధ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. సాయిసుధ ఏం చెప్పారంటే..

  Sai Sudha On Shyam K Naidu || మా మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది, శారీరక బంధానికి నష్టపరిహారం...!!
  తొలిసారి బాడీగార్డ్.. ఆ తర్వాత షాడో..

  తొలిసారి బాడీగార్డ్.. ఆ తర్వాత షాడో..

  మేమిద్దరం సినీ పరిశ్రమలో పనిచేస్తుండటం వల్ల మా మధ్య పరిచయం జరిగింది. తొలిసారి బాడీగార్డ్ సినిమా షూటింగులో కలిశాను. ఆ తర్వాత చాలా గ్యాప్ అనంతరం షాడో షూటింగులో పరిచయం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తరచూ చాటింగ్ చేసుకొంటూ మెసేజ్ షేర్ చేసుకొనే వాళ్లం. నేను ఏదైనా పోస్టు పడితే రియాక్ట్ అయ్యేవారు. అలా నా ఫోన్ నంబర్ అడిగితే నేను ఇచ్చాను. ఆ తర్వాత నాకు ప్రపోజ్ చేయడంతో నేను సానుకూలంగా స్పందించాను.

  భార్యతో గొడువల విషయం

  భార్యతో గొడువల విషయం

  ఆ తర్వాత శ్యాం కే నాయుడుకు భార్యతో గొడవలు ఉన్నాయనే విషయం నాకు తెలిసింది. దాంతో ఆయనను ఆ విషయం గురించి అడిగాను. అయితే గొడవలు క్లియర్ అవుతాయని చెప్పాడు. ఓ రోజు ఆయన భార్య నాకు ఫోన్ చేసి బెదిరించారు. దాంతో ఆయనను నిలదీశాను. దాంతో మా మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక ఆయనతో నాకు సరిపడదని నేను గ్రహించి బ్రేకప్ చెబుదామని అనుకొన్నాను అని సాయిసుధ తెలిపారు.

  మధ్యవర్తులు ఒప్పించారు..

  మధ్యవర్తులు ఒప్పించారు..

  శ్యాం కే నాయుడుకు దూరంగా ఉందామని నిర్ణయం తీసుకొన్న సమయంలో కొందరు మమల్ని మళ్లీ కలిపారు. భార్యతో గొడవలు సెటిల్ అవుతాయని చెప్పి ఒప్పించారు. కానీ వారి మధ్య గొడవలు అలానే కొనసాగాయి. దాంతో నేను పెళ్లి చేసుకొందామని విషయాన్ని చెప్పాను. ఆ తర్వాత నన్ను దూరం పెట్టడంతో కేసు పెట్టాలని నిర్ణయించుకొన్నాను. కుటుంబ సభ్యులు కొందరు మధ్యలో ఆపారు. కానీ ఇక లాభం లేదనుకొన్న తర్వాతే కేసు ఫైల్ చేశాను.

  శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా

  శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా

  శ్యాం కే నాయుడు వల్ల నేను లాభపడింది ఏమీ లేదు. ఆయన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయాను. ఆయనకు ఖర్చు అంతా నేనే పెట్టే వాడిని. ఆయన వల్ల చాలా డబ్బు నేను నష్టపోయాను. కానీ ఎంత డబ్బు అంటే చెప్పలేను. మా మధ్య ప్రేమ ఉన్నప్పుడు ప్రతీ ఖర్చు గురించి లెక్కలేసుకోలేం కదా అని సాయి సుధా అన్నారు.

  మా మధ్య ఫిజికల్ రిలేషన్‌తోపాటు

  మా మధ్య ఫిజికల్ రిలేషన్‌తోపాటు

  మా మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది. దానితోపాటు మా మధ్య ఎమోషనల్ రిలేసన్ కూడా ఉంది. అందుకే నేను శ్యాం నాయుడిని కావాలని కోరుకొంటున్నాను. అందుకే నేను ఆయనపై కేసు పెట్టాను. ఆయన మూలంగా నష్టపోయిన డబ్బు కూడా నాకు కావాలి. అయితే ఆయనతో ఉన్న శారీరక బంధాన్ని నష్టపరిహారం, సెటిల్ మెంట్ కోసం ఎదురు చూడటం లేదు అని సాయి సుధ ఆవేదన వ్యక్తం చేశారు.

  చాలా రకాలుగా నష్టపోయాను..

  చాలా రకాలుగా నష్టపోయాను..

  ఇక శ్యాం కే నాయుడు బంధం కారణంగా చాలా రకాలుగా నష్టపోయాను. నాకు నా కుటుంబం దూరమైంది. నేను ఇప్పుడు ఒంటరిగానే బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా తరఫున నాకు అండగా నిలువాల్సిన వాళ్లే లేరు. పెళ్లైనా వాడితో బంధం పెట్టుకోవడమనేది ప్రశ్నే కాదు. నేను కమిట్ కావడానికి ముందుగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి నేను తెలుసుకోలేదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

  English summary
  Tollywood's Popular Cinematographer Shyam K Naidu has taken into custody by SR Nagar Police. Budding actor Sai Sudha alleges that She was cheated, lost physically and financiallly to him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X