For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ రూమర్‌పై హీరో సిద్దార్థ్ క్లారిటి.. ఇక వదిలిపెట్టే సమస్యే లేదంటూ కామెంట్

  |

  బొమ్మరిల్లు, నువ్వువస్తానంటే నేను వద్దంటానా? చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న సిద్దార్త్‌కు టాలీవుడ్‌లో గ్యాప్ ఏర్పడింది. ప్రస్తుతం RX100 డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన మహా సముద్రం చిత్రంలో ఓ కీలక పాత్రతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్, శర్వానంద్ కలిసి నటించిన ఈ యాక్షన్, ఇంటెన్స్ లవ్ స్టోరితో కూడిన మూవీ అక్టోబర్ 15వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైన నేపథ్యంలో సిద్దార్థ్ మీడియాతో మాట్లాడుతూ..

  సింగిల్ మీటింగ్‌లో ఒకే చేశాను అంటూ

  సింగిల్ మీటింగ్‌లో ఒకే చేశాను అంటూ

  మహా సముద్రం సినిమా కథ ఏ నటుడికైనా ఓ సవాల్ లాంటిది. ఒక హీరో, నటుడికి అన్నీ కుదిరితే ఇలాంటి కథ లభిస్తుంది. అజయ్ భూపతి కథ చెప్పినప్పుడు సింగిల్ మీటింగ్‌లో ఓకే చేశాను. నాకు అజయ్ గురించి బాగా తెలుసు. ఆయన తీసిన RX 100 సినిమా చూశాను. అన్నీ అంశాలను బ్యాలెన్స్ చేసి.. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా నన్ను ఆకట్టుకొన్నారు. తొలి సినిమాను అద్బుతంగా తీసి.. సెకండ్ సినిమాకు తడబాటుకు గురవుతారు. కానీ అజయ్ భూపతికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని సిద్ధార్థ్ పేర్కొన్నారు.

  కోవిడ్ పరిస్థితులను ఎదురించి..

  కోవిడ్ పరిస్థితులను ఎదురించి..

  కోవిడ్ పరిస్థితులను ఎదురించి మహా సముద్రం సినిమాను నిర్మాత అనిల్ సుంకర చాలా ఓపికగా రూపొందించారు. ఈ సినిమా కథ వినగానే నాకు నచ్చింది. ఇది ట్రెండ్ సెట్టర్ చిత్రం అవుతుంది. ఈ రెండు పాత్రలను శర్వానంద్, నేను ఇష్టపడి చేశాం. మా ఇద్దరికి స్క్రిప్టుపై ప్రేమ ఉంది. ఏనాడు మా క్యారెక్టర్లపై ఎలాంటి మాకు కన్ఫ్యూజ్ కాలేదు అని సిద్దార్థ్ అన్నారు.

  మహా సముద్రం బ్లాక్‌బస్టర్ అంటూ

  మహా సముద్రం బ్లాక్‌బస్టర్ అంటూ

  మహా సముద్రం సినిమా కథ చెప్పినప్పుడు రెండు పాత్రల గురించి చెప్పలేదు. నా పాత్ర వరకు నేరేట్ చేశారు. కథ విన్నప్పుడు మంచి కథ విన్నాననే ఫీలింగ్ కలిగింది. అయితే ఓ మంచి డైరెక్టర్‌తో పనిచేస్తున్నాననే భావన ఏర్పడింది. నాకు ఉన్న చాక్లెట్ బాయ్ ఇమేజ్‌ను మైమరిపించే విధంగా నా క్యారెక్టర్ ఉంటుంది. గతంలో భారీ డైరెక్టర్లు భారీ హీరోలతో తీసిన యాక్షన్ మూవీ గుర్తుకు వస్తుంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అజయ్ భూపతి భారీ హిట్ కొట్టబోతున్నాడు అని సిద్దార్థ్ పేర్కొన్నారు.

  నాలో నేను వెతుక్కొనే క్రమంలో బ్రేక్

  నాలో నేను వెతుక్కొనే క్రమంలో బ్రేక్

  2003లో బాయ్స్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. మధ్యలో వచ్చింది బ్రేక్‌లాంటిది కాదు. కానీ నాలో నేను వెతుక్కునే క్రమంలో బ్రేక్ వచ్చింది. అందరూ కాశీ, హిమాలయాలకు వెళ్తుంటారు. అలా నేను కూడా కాస్త గ్యాప్ ఇచ్చాను. నాకు నేను మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నన్ను స్టార్‌ను చేసింది తెలుగు వాళ్లే. అయితే ప్రతీ భాషల్లో నాకు ఓ ఐకానిక్ చిత్రం ఉంది. తమిళంలో బాయ్స్, హిందీలో రంగ్ దే బసంతి ఇలా ఉన్నాయి. అయితే నేను ప్రతీ చోటా తెలుగు నటుడిని అని చెప్పుకునేవాడిని. దాంతో అక్కడి వారు హర్ట్ అయ్యేవారు. కానీ నేను తెలుగు స్టార్‌ని, ఇండియన్ నటుడిని. అందుకే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను అని సిద్దార్థ్ వెల్లడించారు.

  రెండు రకాల విభిన్నమైన పాత్రల్లో

  రెండు రకాల విభిన్నమైన పాత్రల్లో

  మహా సముద్రం సినిమా ఓపెన్ డ్రామా. రెండు టైమ్ పీరియడ్‌లో జరిగే సినిమా. మాకు రెండు రకాల డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి. ఈ సినిమాలో మా మధ్య ఉండే రిలేషన్ ఏమిటనేది తదుపరి ట్రైలర్‌లో తెలుస్తాయి. అంత వరకు వేచి చూడాల్సిందే. అజయ్ భూపతి ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. మహా అనేది హీరోయిన్ పేరు. ఏ సినిమాలో అయితే ఫీమేల్ క్యారెక్టర్ బాగా రాస్తే ఆ సినిమా హిట్ అవుతుంది అని సిద్దార్థ్ పేర్కొన్నారు.

  అలాంటి రూమర్లలో వాస్తవం లేదు అంటూ

  అలాంటి రూమర్లలో వాస్తవం లేదు అంటూ

  నా ఆరోగ్యం గురించి వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. నాకు ఎలాంటి సర్జరీ జరుగలేదు. మహా సముద్రంలో ఓ స్టంట్ సీన్ చేస్తున్నప్పుడు నాకు చిన్న గాయమైంది. దాని కోసం చిన్న ట్రీట్‌మెంట్ కోసం లండన్‌కు వెళ్లాను. అయితే ఆ సమయంలో దర్శకుడు అజయ్ భూపతి నాకు ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ రావాలని అడిగారు. అయితే నాకు లండన్‌లో చిన్న ట్రీట్‌మెంట్ ఉందని ఆయనకు చెప్పాను. కానీ ఆయన సరిగా అర్ధం చేసుకొకుండా సోషల్ మీడియాలో పడితే మా ఇంటికి చాలా ఫోన్లు వెళ్లాయి. నా వెన్నుముకకు సర్జరీ జరిగిందని వాళ్లకు ఫోన్స్ వెళితే మా ఇంటి నుంచి నాకు కాల్స్ వచ్చాయి. అయితే వెంటనే అజయ్‌కి ఫోన్ చేసి.. నాకు సర్జరీ జరగలేదు. చిన్న ట్రీట్‌మెంట్ మాత్రమే జరిగింది అని చెప్పాను. అయితే నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నేనా చాలా ఫిట్‌గా ఉన్నాను అని సిద్దార్థ్ చెప్పారు.

  English summary
  Actor Siddharth clarity about his health and Maha Samudram movie. He said, Ajay Bhupathi's movie is sure shot blackbuster.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X