For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raja Raja Chora.. మాస్ హీరోగా మారుతున్నా.. ఆ హీరో ఎలాంటి సలహా ఇచ్చారంటే.. శ్రీ విష్ణు వెల్లడి

  |

  టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్‌లు ఊపందుకొంటున్నాయి. సెకండ్ వేవ్ లాక్‌డౌన్ తర్వాత చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి కోవలో వస్తున్న చిత్రమే రాజ రాజ చోర. విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు ఘాటైన స్పీచ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. విక్టరీ వెంకటేష్ సినిమాల మాదిరిగా రాజ రాజ చోర ఉంటుంది కామెంట్ చేశారు. వెంకటేష్‌ను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనే విషయాన్ని శ్రీ విష్ణు వెల్లడిస్తూ..

  Jr. NTR చేతికి లాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్.. దేశంలోనే తొలి వ్యక్తిగా యంగ్ టైగర్ రికార్డు.. ధర, ప్రత్యేకతలు ఏమిటంటే!

  రాజ రాజ చోర మూవీని వెంకటేష్ సినిమాతో ఎందుకు పోల్చారు ఎందుకు?

  రాజ రాజ చోర మూవీని వెంకటేష్ సినిమాతో ఎందుకు పోల్చారు ఎందుకు?

  నేను విక్టరీ వెంకటేష్ ఫ్యాన్‌ను. రాజ రాజ చోర సినిమాను చూసినప్పుడు వెంకటేష్ మూవీలో ఉండే ఫీల్‌గుడ్ అంశాలు మా సినిమాలో కూడా ఉన్నాయని అనిపించింది. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమా ప్రారంభం సమయంలో వెంకటేష్ గారిని కలిసి ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే సినిమా అని చెప్పాను. ఆ తర్వాత టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత ముందుగా స్పందించింది వెంకటేష్ గారే. ఆయన ఫోన్ చేసి కామెడీ టైమింగ్ బాగుందని చెప్పారు.

  అప్పుడే కలుద్దామని అనుకొన్నాం. కానీ కరోనావైరస్ కారణంగా కలువలేకపోయాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో అదే విషయాన్ని ప్రస్తావించడంతో ఆయన పిలవడంతో ఆయనను కలిసి సినిమా గురించి చెప్పాను. మా యూనిట్‌కు బెస్ట్ విషెస్ ఆయన చెప్పడం హ్యాపీగా ఉంది అని శ్రీ విష్ణు అన్నారు.

  Sai Pallavi తో నాగచైతన్య కెమిస్ట్రీ అదుర్స్.. వెండితెర మీద ఇక సారంగ ధరియే!

  వెంకటేష్ కాంప్లిమెంట్ ఇవ్వడంపై ఎలా ఫీలవుతున్నారు?

  వెంకటేష్ కాంప్లిమెంట్ ఇవ్వడంపై ఎలా ఫీలవుతున్నారు?

  కాలేజ్ రోజుల్లో నుంచి వెంకటేష్ అంటే ఇష్టం. సినీ హీరోగా మారిన తర్వాత ఆయనను కలిసే అవకాశం వచ్చింది. అయినా నేను కలువలేదు. నన్ను నేనుగా ప్రూవ్ చేసుకొన్న తర్వాత ఆయనను కలువాలనే టార్గెట్ పెట్టుకొన్నాను. నీది నాది ఒకే కథ మూవీ తర్వాత ఆయనే నన్ను పిలిచారు. ఆ సమయంలో నా గురించి చెప్పాను. అప్పుడు మీరు ఎప్పడంటే అప్పుడు నా వద్దకు రావొచ్చు. ఏది కావాలన్నా నన్ను అడుగవచ్చని వెంకటేష్ గారు చెప్పారు.

  నాకు ఏదైనా డౌట్ ఉంటే.. ఆయన సలహాలు, సూచనలు తీసుకొంటాను. నాకు బాగా హెల్ప్ అయ్యాయి. అన్ని సినిమాల్లో బ్రహ్మండంగా చేస్తున్నారు. మాస్ సినిమాలు చేయమని చెప్పారు. ఆయన సలహా మేరకు మాస్ ఎలిమెంట్స్‌తో గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తున్నాను అని శ్రీవిష్ణు తెలిపారు.

  Shruti Haasan హాట్ హాట్‌గా.. ముంబైలో బ్యూటీ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే!

  రాబోయే చిత్రాలు ఏమిటంటే?

  రాబోయే చిత్రాలు ఏమిటంటే?

  అర్జున ఫాల్గుణా, భళా తందనాన చిత్రాలు చేస్తున్నాను. పోలీస్ ఆఫీసర్ కథతో కాప్ బయోపిక్ చేస్తున్నాను. మంచి స్క్రిప్టుతో ఉన్న సినిమాలే చేస్తున్నాను. లవ్, ఎమోషనల్ పాయింట్‌తో పోలీస్ కథ చేస్తున్నాను. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమా ఉంటుంది. రాజ రాజ చోర విషయానికి వస్తే ఓ మంచి సినిమా చేశామనే తృప్తి ఉంది. సినిమా చూసిన తర్వాత కూడా అదే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది అని శ్రీవిష్ణు ధీమా వ్యక్తం చేశారు.

  Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

  రాజ రాజ చోర మూవీలో నటీనటులు

  రాజ రాజ చోర మూవీలో నటీనటులు


  నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యాంగర్, అజయ్ ఘోష్, గంగవ్వ, వాసు ఇంటూరి, కాదంబరి కిరణ్ తదితరులు
  దర్శకత్వం: హసిత్ గోలి
  నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
  సినిమాటోగ్రఫి: వేద రామన్ శంకరన్
  ఎడిటింగ్: విప్లవ్ నైషాడం
  మ్యూజిక్: వివేక్ సాగర్
  బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
  రిలీజ్ డేట్: 2021-08-19

  English summary
  Actor Sree Vishnu's latest movie is Raja Raja Chora. This movie set release on August 19th. In this occassion, Sree Vishnu speak to media exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X