For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోతో లెక్కలేనన్ని లిప్‌లాక్స్.. బోల్డ్ సీన్స్.. రియల్ లైఫ్‌లో చాలా బ్రేకప్స్.. అనన్య రాజ్ (ఇంటర్వ్యూ)

  |

  భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ కుమార్ పండే, ఎన్ అఖిలేష్ రెడ్డి, పీవీ సుబ్బారెడ్డి నిర్మాతలుగా శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం తగ్గేదేలే. నవీన్ చంద్ర, అనన్య రాజ్, దివ్య పిళ్లై నటించిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర ఓ కీలక పాత్రలో నటించడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్ అనన్య రాజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

   స్క్రిప్టు డిమాండ్ చేయడంతో

  స్క్రిప్టు డిమాండ్ చేయడంతో

  తగ్గేదేలే సినిమాలో రొమాన్స్, బోల్డ్ కంటెంట్ చాలా ఉంటుంది. అయితే కథ డిమాండ్ చేయడం వల్లే ముద్దు సీన్లు పెట్టాల్సి వచ్చింది. హీరో క్యారెక్టరైజేషన్‌కు అలాంటి కంటెంట్ చాలా ముఖ్యం. ఇటీవల ప్రీవ్యూ చూసిన తర్వాత నా తల్లిని అడిగితే.. స్క్రిప్టు డిమాండ్ చేసినప్పుడు అలాంటి సీన్లు చేయడంలో తప్పేమీ లేదు. నేను లిజీ క్యారెక్టర్‌ను చేస్తున్నాను. ఆ పాత్రను నేను కాదు.. ఎవరు చేసినా అలాంటి సీన్లలో నటించాల్సిందే అని అనన్య రాజ్ తెలిపింది.

  100 రీటేక్స్‌తో లిప్ లాక్స్

  100 రీటేక్స్‌తో లిప్ లాక్స్


  తగ్గేదేలే సినిమాలో లెక్కలేనన్ని లిప్‌లాక్స్ ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం చాలా కష్టం అని అనన్య రాజ్ అన్నారు. అయితే సెట్లో మాత్రం చాలా రీటేక్స్ జరిగాయి. లిప్ లాక్ సీన్లు చిత్రీకరణ సమయంలో 100 రీటేక్స్ జరిగి ఉంటాయి. లిప్ లాక్స్ విషయంలో నేను చాలా ఎక్స్‌పర్ట్. నవీన్ చంద్ర చాలా సహకరించాడు. దాంతోనే స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ పండింది అని అనన్య రాజ్ చెప్పింది.

  నా బాయ్‌ఫ్రెండ్స్‌తో అలాంటి అనుభవం

  నా బాయ్‌ఫ్రెండ్స్‌తో అలాంటి అనుభవం


  నా నిజ జీవితంలో జరిగిన అఫైర్లు, బ్రేకప్స్ అనుభవాలు సినిమా కోసం పనికి వచ్చాయి. ఈ జనరేషన్‌లో ప్రతీ అమ్మాయికి, అబ్బాయికి బ్రేకప్స్ చాలా సర్వసాధారణం. వాటిని దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌ను చాలా సార్లు ముద్దు పెట్టుకొన్నాను. నాకు చాలాసార్లు బ్రేకప్ అయ్యాయి. చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. లిజీ క్యారెక్టర్‌ విషయానికి వస్తే.. నా క్యారెక్టర్‌ చాలా హెడ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది అని అనన్య రాజ్ వెల్లడించింది.

   రియల్‌గా మిస్టీరియస్ గర్ల్

  రియల్‌గా మిస్టీరియస్ గర్ల్


  అనన్య రాజ్ గురించి దర్శకుడు శ్రీనివాసరాజు, నిర్మాత రాజా రవీంద్ర మాట్లాడుతూ.. నిజ జీవితంలో కూడా అమ్మాయి మిస్టీరియస్. ఆమెలోని మిస్టీరియస్ కోణం చేసే లిజీ పాత్రకు ఎంపిక చేశాం అని రాజా రవీంద్ర చెప్పారు. అయితే తొలినాళ్లలో నాకు తెలుగు రాకపోవడం వల్ల యూనిట్‌ను ఇబ్బంది పెట్టాను. కానీ ఆ తర్వాత సర్దుకోవడం జరిగింది. నా యూనిట్ సభ్యులకు నేను క్షమాపణ చెప్పాను అని అనన్య రాజ్ అన్నారు.

  మాస్ ఎలిమెంట్స్‌తో

  మాస్ ఎలిమెంట్స్‌తో


  నవీన్ చంద్రతో అనన్య రాజ్ సన్నివేశాలు బాగా వచ్చాయి. కథ, కథనాల ప్రకారం ఎమోషన్స్, యాక్షన్ సీన్లు హైలెట్ అనిపిస్తాయి. తగ్గేదేలే మాస్ ఎలిమింట్స్ పుష్కలంగా ఉన్న చిత్రం. ప్రతీ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రమిది. నవంబర్ 4న తప్పకుండా థియేటర్లలో చూడండి అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

  తగ్గేదేలే మూవీలో..


  నటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య రాజ్, నైనా గంగూళీ, రవిశంకర్, నాగబాబు, అయ్యప్ప శర్మ, పూజా గాంధీ, మక్రంద్ దేశ్ పాండే, రవి కాలే తదితరులు
  దర్శకత్వం: శ్రీనివాస రాజు
  నిర్మాతలు: ప్రేమ్ కుమార్ పండే, ఎన్ అఖిలేష్ రెడ్డి, పీవీ సుబ్బారెడ్డి
  డీవోపీ: వెంకట్ ప్రసాద్
  మ్యూజిక్ డైరెక్టర్: చరణ్ అర్జున్
  బీజీఎం: చిన్నా
  ఎడిటర్: గ్యారీ బీహెచ్
  ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
  రిలీజ్ డేట్: 2022-11-04

  English summary
  Thaggedele is set to release on November 4th. Here is the heroine Ananya Raj's Exclusive Interview for Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X