For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేవ దాసీల్లా పని చేయాలి, గిల్లితే గిల్లించుకోవాలి అంటూ అనసూయ షాకింగ్​ కామెంట్స్​

  |

  బుల్లితెర బ్యూటిఫుల్​ యాంకర్​ అనసూయ భరద్వాజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్మాల్​స్క్రీన్​పై యాంకర్​గా తన ప్రత్యేకతను చాటుకుంది. యాంకరింగ్​తో కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడప్పుడు తన అందచందాలను సోషల్​ మీడియా వేదికగా ప్రదర్శించే అనసూయకు స్టార్​ హీరోయిన్​కు ఉన్నంత క్రేజ్​ ఉంది. అయితే జబర్ధస్త్​ కామెడీ షోతో లైమ్​లైట్​లోకి వచ్చిన అనసూయ ఇటీవలే ఆ షోకు గుడ్​ బై చెప్పిన విషయంతెలిసిందే. ఇక అప్పటినుంచి వార్తల్లో నిలుస్తున్న అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలో మహిళలను ఎలా ట్రీట్​ చేస్తారో చెబుతూ షాకింగ్​ కామెంట్స్​ చేసింది.

   గిల్లితే గిల్లించుకోవాలి..

  గిల్లితే గిల్లించుకోవాలి..


  ''ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే ముఖ్యంగా హీరోయిన్స్​కు ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. హీరోయిన్​ అంటే కెమెరా ముందు కాపాడండి అంటూ ఉండాలి. లేదా సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. అస్సలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్​ ఉంది కదా. సేమ్​ అలాగే ఇక్కడ పరిస్థితి ఉంటుంది.

  మాట్లాడకుండా ఉన్నా తప్పే..

  మాట్లాడకుండా ఉన్నా తప్పే..

  మేం ఇక్కడ దేవ దాసీల్లాగే పని చేయాలి. మా హక్కుల కోసం మాట్లాడితే చాలలు మమ్మల్ని తొక్కేస్తారు. అది చాలా తప్పు. నేను మాట్లాడకుండా ఉన్నా సరే నాపై వేలెత్తి చూపించిన వాళ్లు ఉన్నారు. మాట్లాడితే తప్పు, మాట్లాడకుండా ఉన్నా తప్పే.. ఇక్కడ ఇలా ఉంటుందు మా పరిస్థితి.

   సినిమా చూడాలనే ఆసక్తే పోతుంది..

  సినిమా చూడాలనే ఆసక్తే పోతుంది..

  ఈ ఎంటర్​టైన్​మెంట్​ ఫీల్డ్​ అంటే అందరికీ ఆసక్తే. కానీ ఇక్కడ అందరిలాగే మేం పనిచేస్తాం. కానీ ఈ రంగుల ప్రపంచం వేరు. బయటకు కనిపించినంత హుందాగా ఉండదు. అసలు అందరూ దీనిలోని లోతును ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు. నిజానికి, సినీ సెలబ్రిటీల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల మీకు సినిమా చూడాలనే ఆసక్తే పోతుంది.

  సినిమాలు చూసే అర్హత మీకు ఉందా?

  సినిమాలు చూసే అర్హత మీకు ఉందా?

  మా గురించి మీకు అంతగా తెలియనివ్వకుండా మేము మీకు పెద్ద ఫేవర్​ చేస్తూన్నాం. అసలు మా సినిమాలు చూసే అర్హత మీకు ఉందా? అని మేం ఆలోచించడం స్టార్ట్​ చేస్తే ఎవడొస్తాడు థియేటర్​కి?'' అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటిపుల్​ యాంకర్​ అనసూయ. అనంతరం తన ఫ్యామిలీ సపోర్ట్​, పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

  వాంటెడ్​ పండుగాడ్​తో ..

  వాంటెడ్​ పండుగాడ్​తో ..


  కాగా ఆగస్టు 19న వాంటెడ్​ పండుగాడ్​ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది అనసూయ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో సునీల్, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, శ్రీనివాస్​ రెడ్డి, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీధర్​ సీపాన దర్శకత్వం వహించగా, సాయిబాబా కోవెలమూడి, వెంకట్​ కోవెలమూడి నిర్మించారు.

  బ్యాలెన్స్​ చేస్తూ..

  బ్యాలెన్స్​ చేస్తూ..


  ఈ సినిమానే కాకుండా పుష్ప 2, రంగమార్తాండ, అరి, సింబ, మైఖేల్​ వంటి సినిమాల్లోనూ నటిస్తూ ఇటు ప్రొఫెషనల్​ లైఫ్​, అటు ఫ్యామిలీ లైఫ్​ను బ్యాలెన్స్​ చేస్తూ ముందుకు సాగిపోతోంది ఈ బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్​ అనసూయ భరద్వాజ్.

  English summary
  Anchor Anasuya Bharadwaj Shocking Comments About Tollywood Industry And Explains How They Treat Womens
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X