twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిచ్చి వేషాలు వేశానని.. చిన్న వయసులోనే పెళ్లి చేశారు.. దాంతో కెరీర్ అంటూ గాయత్రి భార్గవి

    |

    యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న గాయత్రి భార్గవి సినిమా రంగంలో మంచి పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా కరోనావైరస్ చిత్రంలో భావోద్వేగమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పంచుకొన్నారు. బాపు గారితో ఉన్న అనుబంధం, ఇతర విషయాల గురించి చెబుతూ..

    ఆయన పేరు వాడుకొని పైకి రావాలనుకోలేదు

    ఆయన పేరు వాడుకొని పైకి రావాలనుకోలేదు

    ప్రముఖ దర్శకులు బాపు గారి మనవరాలిని. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా గురించి ఎవరికి తెలియదు. నేను బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదు. అలా పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. బాపు పేరు వాడుకొని ఎదగాలని కోరుకోవడం మూర్ఖత్వం అని భావించాను. స్వయంకృషితో పెరిగితే అందులో ఉండే తృప్తి మరోదానిలో ఉండదు అని గాయత్రి భార్గవి అన్నారు.

    పిచ్చి వేషాలు వేస్తున్నానని...

    పిచ్చి వేషాలు వేస్తున్నానని...

    నేను యాడ్ ఫిలింస్ చేయడం ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించాను. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి, మా తాత గారికి ఇష్టం లేదు. సినిమాలు, నాటకాలు అంటూ పిచ్చి వేషాలు వేస్తుందని నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. 21 ఏళ్లలోనే నాకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నా భర్త సినిమాలు చేయమని చెప్పడంతో మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించాను అని గాయత్రి భార్గవి పేర్కొన్నారు.

    చిన్న వయసులో పెళ్లి చేసుకొని

    చిన్న వయసులో పెళ్లి చేసుకొని

    చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ పరంగా సెటిల్ అయ్యాను. ఆ తర్వాత నా భర్త అంగీకారం మేరకు మళ్లీ సినిమా పరిశ్రమలోకి వచ్చాను. యాంకర్‌గా బిజీ అయ్యాను. చాలా మందికి నేను నటిస్తున్నారనే తెలియకపోవడంతో మంచి పాత్రలు రాకపోవచ్చు. ఇప్పుడు మంచి పాత్రలు వస్తున్నాయి అని గాయత్రి భార్గవి తెలిపారు.

    యాక్టింగ్ కష్టం కాలేదు

    యాక్టింగ్ కష్టం కాలేదు

    నాకు యాక్టింగ్ అంటే ముందు నుంచి ఇష్టం. యాక్టింగ్ కోచింగ్ కోసం ఎక్కడికి ఎవ్వలేదు. ఇంట్లోనే అలాంటి వాతావరణం ఉండటంతో యాక్టింగ్ పెద్దగా కష్టంగా మారలేదు. నా రక్తంలోనే యాక్టింగ్ లక్షణాలు ఉన్నాయి. అందుకే నటిగా మారాను అని గాయత్రి భార్గవి చెప్పారు.

    ఆర్జీవి చిత్రంలో కీలక పాత్రలో

    ఆర్జీవి చిత్రంలో కీలక పాత్రలో

    ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న కరోనావైరస్ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్‌కు భార్యగా భారమైన పాత్రలో నటించి మెప్పించారు. అలాగే పలు చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే మంచి పాత్రలతో ఆలరిస్తాననే విషయాన్ని ఆమె మీడియాతో పంచుకొన్నారు.

    English summary
    Anchor Gayatri Bhargavi talks about personal life, professional life and anchoring profession. She reveals about the relation with director Bapu. She said.. family opposed about my acting and entry into film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X