For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి, బాలకృష్ణ డెడికేషన్ సూపర్బ్.. వారిద్దరిలో గొప్ప విషయం ఏమిటంటే..శేఖర్ మాస్టర్ ఇంటర్వ్యూ

  |

  మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నచిత్రం వాల్తేరు వీరయ్య. ఇప్పటికే విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి.. 'వీరసింహారెడ్డి' చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వాల్తేరు వీరయ్యలోని అన్ని పాటలకు (సింగిల్ కార్డ్) కొరియోగ్రఫీ అందించారు వీజే శేఖర్ మాస్టర్. అలాగే వీరసింహారెడ్డిలోని రెండు పాటలకు (సుగుణ సుందరి, మా బావ మనోభావాలు) కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు సంబంధించిన పాటల గురించి వివరాలు అందజేస్తూ..

  చిరంజీవి, బాలకృష్ణతో పనిచేయడం టెన్షన్‌గా

  చిరంజీవి, బాలకృష్ణతో పనిచేయడం టెన్షన్‌గా


  చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు పెద్ద స్టార్స్ సినిమాలకు పాటలు చేస్తున్నప్పుడు రెండు సినిమాలు పండక్కి వస్తాయని తెలీదు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేశాను. ఇప్పుడు రెండు సినిమాల పాటలు, లిరికల్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతుండటంతో టెన్షన్‌గా ఉంది. కానీ చాలా ఆనందంగా ఉంది అని శేఖర్ మాస్టర్ అన్నారు.

  నాకు పెద్ద పండుగ లాంటి విషయం

  నాకు పెద్ద పండుగ లాంటి విషయం


  హీరోల అభిమానుల మధ్య మా హీరో మీ హీరో పోలీకలు రావడం చాలా సహజం. కానీ ఈ రెండు సినిమాల విషయంలో అలాంటిది కనిపించలేదు. సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి వస్తున్నారు. నాకైతే ఇది ఇంకా పెద్ద పండగ. వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు చేశాను. వీరసింహారెడ్డిలో రెండు పాటలు చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

  ఇద్దరి హీరోల టైమింగ్ సెన్స్

  ఇద్దరి హీరోల టైమింగ్ సెన్స్


  చిరంజీవి, బాలకృష్ణ టాప్ హీరోలు, ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. ఇద్దరిలో ఉన్న యూనిక్ క్యాలిటీ డెడికేషన్. ఒక మూమెంట్ చెబితే అది పూర్తయ్యేవరకూ రిలాక్స్ అవ్వరు. ఆ డెడికేషన్ ఇద్దరిలో చూశా. అలాగే వారిద్దరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందేమిటంటే.. టైమింగ్ సెన్స్. కొన్నిసార్లు పాటను కంపోజ్ చేసుకొంటూ వెళ్తాం. కానీ లోకేషన్ బట్టి మారిపోతుంటుంది. ఈ రెండు సినిమాల విషయంలో రిహార్సల్స్ బాగా చేశాం అని అన్నారు.

  చిరంజీవి, బాలయ్యతో చాలా కంఫర్ట్

  చిరంజీవి, బాలయ్యతో చాలా కంఫర్ట్


  చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకు డ్యాన్స్ కంపోజ్ చేయడం కష్టమనిపించదు. వారితో పని చేయడంలో చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ సమయంలోగా పూర్తి చేయాలని నిర్మాత ఒక టైం ఇస్తారు. ఒకసారి వాళ్లు సెట్‌కు వస్తే అది పూర్తయ్యేవకూ వెళ్లరు. దీంతో మాకు సమయం మిగులుతుంది. పని కూడా త్వరగా పూర్తవుతుంది అని శేఖర్ మాస్టర్ చెప్పారు.

  సిగ్నేచర్ స్టెప్స్ బట్టే పాట హిట్

  సిగ్నేచర్ స్టెప్స్ బట్టే పాట హిట్


  హీరోల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి డ్యాన్స్ మాస్టర్లు సిగ్నేచర్ స్టెప్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలని డిసైడ్ అవుతాం. పాట రిలీజైన వెంటనే బాగుంటే.. వెంటనే రీల్స్ వచ్చేస్తున్నాయి. సాంగ్ హిట్ అయ్యిందా లేదా అనేది తర్వాత.. ముందు రీల్స్‌లో వచ్చే మూమెంట్ హిట్ అయితే ఆటోమేటిక్‌గా పాటను హిట్ చేస్తున్నారు. సినిమాలో సాంగ్ ఎలా ఉంటుందా అనే తర్వాత సంగతి. సిగ్నేచర్ స్టెప్ హిట్ అయి జనాల్లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం సినిమాకు తప్పకుండా ఒక సిగ్నేచర్ స్టెప్పు కావాలి అని శేఖర్ మాస్టర్ చెప్పారు.

  English summary
  Tollywood's Top Star choreographer VJ Shekhar Master doing Choreography for Chiranjeevi's Waltair Veeraiah and Balakrishna's Veera Simha Reddy. Here is the VJ Shekhar Master's interveiew.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X