Don't Miss!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- News
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం..!!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy లో బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ అవుట్‌స్టాండింగ్.. మూవీ విజువల్ ఫీస్ట్
God of Masses నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం వీరసింహారెడ్డి. అందాల తార శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన రిషి పంజాబీ మీడియాతో మాట్లాడుతూ..
వీరసింహారెడ్డి లార్జర్ ద్యాన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ మరో లెవెల్‌లో ఉంటాయి. వీరసింహారెడ్డి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. పలు సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. వీరసింహారెడ్డి బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్‌టైనర్ అని రిషి పంజాబీ అన్నారు.

నందమూరి బాలకృష్ణతో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెక్నిషియన్స్‌ను ఆయన గొప్పగా అర్ధం చేసుకుంటారు. బాలకృష్ణకు ప్రతీ డిపార్ట్‌మెంట్‌పై గొప్ప అవగాహన ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్రజన్స్ అవుట్ స్టాండింగ్ అని అన్నారు. వీరసింహారెడ్డి కోసం ఏడాది పాటు షూట్ చేశాం. సిరిసిల్లాలో షూట్ చేస్తునపుడు తీవ్రమైన ఎండ, అలాగే టర్కీ , ఇస్తాంబుల్, అంటాల్య లో కూడా షూటింగ్ చేశాం. అక్కడ కూడా చాలా వేడిలోనే పనిచేశాం అని రిషి పంజాబి చెప్పారు.
బాలకృష్ణను తెరపై గొప్పగా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో లండన్ నుంచి ప్రత్యేకంగా న్యూ సెటప్ లెన్స్ వాడాం. కలర్స్ అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి అని చెప్పారు.
గోపీచంద్ మలినేని వండర్‌ఫుల్ డైరెక్టర్. తనకి చాలా మంచి భవిష్యత్ ఉంటుంది. ఆలోచనలు పంచుకోవడం పట్ల చాలా ఓపెన్‌గా ఉంటారు. ఆయన దర్శకత్వం వహించిన క్రాక్ చూశాను. నిజానికి మేము కలసి ప్రాజెక్ట్ చేయాల్సింది. వేర్వేరు ప్రాజెక్ట్స్ ఉండటం వలన కుదరలేదు. ఇప్పుడు తనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్ గారు అద్భుతమైన నిర్మాతలు. వారి సపోర్ట్ మర్చిపోలేను. ఇంత గొప్ప నిర్మాతలని నేను చూడలేదు. వారికి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ తో మళ్ళీ మళ్ళీ కలసి పని చేయాలని ఉంది.
రిషీ పంజాబీ విషయానికి వస్తే.. గతంలో సరైనోడు, జయ జానకి నాయక లాంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌కు పనిచేశారు.