Just In
- 1 hr ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 2 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 3 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 4 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
ఇద్దరు కలెక్టర్లపై చర్యలు..ఎస్ఈసీ ఆదేశాలతో జీఏడీకి సరెండర్
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ మాట చెప్పిన కమల్ హాసన్.. అలా మైండ్ బ్లాక్ సాంగ్.. దేవీ శ్రీ ప్రసాద్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు-రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే కేవలం మహేష్ ఫ్యాన్స్‌కే కాదు.. సగటు సినీ అభిమానికి ఇష్టమే. వీరి కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. వన్ నేనొక్కడినే నుంచి మొదలైన ప్రస్థానం నేటి వరకు కొనసాగుతూనే ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న వీరిద్దరు మరో సారి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రాబోతోన్నారు. రేపు (జనవరి 11) ఈ కమ్రంలో మీడియాతో చిత్ర విశేషాలను చెప్పుకొచ్చాడు.

కమల్ హాసన్ చెప్పిన మాట..
దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నేను ప్రతి సినిమాని ఫస్ట్ సినిమాలనే ఫీల్ అవుతాను. ఫస్ట్ ఫిల్మ్ టైంలో ఓ భయం ఉంటుంది. ఆ భయం ఉన్నంత కాలం ఎన్ని సినిమాలు చేసినా ఆ ఫ్రెష్ నెస్ పోదు. ఓ సందర్భంలో కమల్ హాసన్ గారు చెప్పారు. ప్రతి సినిమా విషయంలో ఆ భయం అలాగే ఉంచు. ఆ భయమే మనల్ని కాపాడుతుందని. నేనూ అదే నమ్ముతాను.

ఫోటోగ్రఫీ అంటే ఇష్టం..
నాకు ఫొటోగ్రఫీ అంటే బాగా ఇంట్రస్ట్. నేను ట్రావెలింగ్ లో ఖచ్చితంగా ఒక కెమెరాను తీసుకువెళ్తాను. బేసిగ్గా మా నాన్నగారికి ఫొటోగ్రఫీ అంటే బాగా ఇష్టం. ఆయన ఇండస్ట్రీకి వచ్చిందే కెమరామెన్ అవుదామని. కానీ అనుకోకుండా రైటర్ అయ్యారు. ఆయన ద్వారా నాకు కూడా ఫొటోగ్రఫీ మీద బాగా ఇష్టం పెరిగింది.

అలా మైండ్ బ్లాక్..
నేను ఫస్ట్ టైం స్క్రిప్ట్ విన్నప్పుడే.. అన్ని రకాలుగా ఉండే పూర్తి ఆల్బమ్ అని నాకు నమ్మకం వచ్చేసింది. మినిమమ్ రెండు డ్యాన్స్ నెంబర్స్ వస్తాయి, అలాగే అన్ని రకాల జోనర్ సాంగ్స్ కి స్కోప్ ఉందనిపిచింది. మైండ్ బ్లాక్ సాంగ్ విషయానికొస్తే అనిల్ రావిపూడి గారు కథ చెప్పేటప్పుడే.. లుంగీ, పూలు, జుబ్బా వేసుకుంటారని అలా డిస్క్రిప్షన్ ఇచ్చారు.. ఎప్పుడు ప్యాంటేసేవాడు.. ఇప్పుడు లుంగీ కట్టేశాడు.. అంటూ అందే సమయంలో లిరిక్స్ కూడా రాసేశాను.

అన్నీ డిఫరెంట్ సినిమాలే..
సుకుమార్ - అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాను. మా కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుంది ఆ సినిమా. అలాగే ‘ఉప్పెన' సినిమా చేస్తున్నాను. అది పూర్తిగా డిఫరెంట్ సినిమా. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఉంటుంది. సంగీత ప్రధానంగా సాగుతుంది. నితిన్ ‘రంగ్ దే' కూడా పూర్తి ప్రేమ కథా చిత్రం.. అలాగే కీర్తి సురేష్ సినిమా కూడా చేస్తున్నాను. అంతేకాకుండా త్వరలోనే ఓ హిందీ చిత్రం కూడా కన్ఫమ్ అయ్యే చాన్స్ ఉంది. త్వరలోనే దాని వివరాలు కూడా చెబుతాన'ని అన్నాడు.