For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అలా చేస్తే పళ్లురాలుతాయ్, రిలీజ్ ముందే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశా: దిల్ రాజు

  |

  'ఎఫ్ 2' మూవీతో సంక్రాంతికి సంచలన విజయం నమోదు చేసిన దిల్ రాజ్ సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ త్వరలో '96' సినిమాను శర్వానంద్-సమంత కాంబినేషన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నాగ చైతన్యతో కూడా సినిమా ఓకే అయిందని, అది ఎప్పుడు మొదలవుతుంది అనేది త్వరలో చెబుతామన్నారు.

  'ఎఫ్ 2' సూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న దిల్ రాజు... ఈ ఏడాది తాను చేయబోయే ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. 2017లో మాదిరిగా ఈ ఏడాది కూడా సిక్సర్ కొడతారా అంటే స్క్రిప్టులు కలిసొస్తే కొడతామని తెలిపారు.

  అలా చేస్తే పళ్లు రాలుతాయ్

  అలా చేస్తే పళ్లు రాలుతాయ్

  2017 ఆరు సినిమాలు చేయాలని చేయలేదు. స్క్రిప్టులు వరుసగా రెడీ అవ్వడం వల్లే సాధ్యమైంది. ఇపుడు కూడా 4 నుంచి 5 ప్రాజెక్టులపై క్లారిటీ ఉంది. 6వ దానిపై క్లారిటీ వస్తుందా? లేదా? అనేది ఏప్రిల్ వరకు చెప్పలేను. ఎలాగైనా 6 సినిమాలు చేయాలని చేస్తే పల్లు రాళతాయి.. అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

  మహర్షి అందుకే లేటు అవుతోంది

  మహర్షి అందుకే లేటు అవుతోంది

  ‘మహర్షి' షూటింగ్ లేటు కావడానికి యూఎస్ వీసా ప్రాసెస్ సమయానికి పూర్తికాకపోవడమే. నెలరోజులు ఆలస్యం కావడంతో షెడ్యూల్ మొత్తం మారిపోయింది. మార్చిలో దాదాపు కంప్లీట్ చేసి ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నాం. బయట షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఫిబ్రవరి 2 నుంచి హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలవుతుందని తెలిపారు.

  అప్పటికీ సమంతకు ఇంకా క్లారిటీ లేదు

  అప్పటికీ సమంతకు ఇంకా క్లారిటీ లేదు

  సమంత 96 రీమేక్ చేయకూడదని గతంలో అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెను ఎలా ఒప్పించారు? అనే ప్రశ్నకు దిల్ రాజు స్పందిస్తూ... సమంత ఆ సినిమా చూడక ముందే ఆమెతో ఫోన్‌లో మాట్లాడాను. 96 సినిమా చూడమని చెప్పాను. ఎవరు హీరో, ఎవరు డైరెక్టర్ అనేది పర్సనల్‌గా వచ్చి మాట్లాడతానని చెప్పాను. సినిమా చూసి దాని గురించి ట్వీట్ చేసింది. నేను ఎవరితో చేస్తున్నాను, ఎవరు డైరెక్టర్ అనేది క్లారిటీ లేక ముందు అలా ట్వీట్ చేసింది.

  నాకు పూర్తి నమ్మకం ఉంది

  నాకు పూర్తి నమ్మకం ఉంది

  96 సినిమా విషయంలో నాకు సంబంధం లేకుండా రకరకాల వార్తలు క్యారీ అయ్యాయి. సమంత ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిందేమో. నేను ఫిక్స్ అయ్యాక డైరెక్టర్‌ను పిలిచి సమంతను కూర్చోపెట్టి ఒరిజినల్ డైరెక్టర్‌తో సినిమా తీయబోతున్నాను, తెలుగుకు ఎలా ఉండబోతోంది చర్చించాం. 96 అనే సినిమా తెలుగులో సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అయితే నాకు ఉంది.

  సమంత, శర్వానంద బెస్ట్ అనిపించింది

  సమంత, శర్వానంద బెస్ట్ అనిపించింది

  96 సినిమా రిలీజ్ ముందే నేను వెళ్లి చూశాను. నాకు తమిళం అర్థంకాకపోయినా ఫీలింగ్స్ అర్థమయ్యాయి. ఈ పదిహేను సంవత్సరాల్లో నేను రీమేక్ చేయలేదు. ఇది ఫస్ట్ రీమేక్. దీనికి బెస్ట్ ఆర్టిస్టులు ఎవరు? అంటే సమంత, శర్వానంద్ అని అనిపించింది.

  అదొక అద్భుతమైన ఫీల్

  అదొక అద్భుతమైన ఫీల్

  96 అనేది తమిళంలో క్లాసిక్ సినిమా. తెలుగులో హిట్టవుతుందా? కాదా? అనేది షూటింగ్ పూర్తయి ప్రింట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సినిమా అద్భుతంగా ఉంటుందని నేను ఫీలవుతున్నాను. ఆ అద్భుతం స్క్రీన్ మీదకు రావాలి. నేను దాని కోసం వెయిట్ చేస్తున్నాను. 96 అనేది మేకింగ్ ఫిల్మ్ కాదు, అదొక ఫీల్. రెండు పాత్రలను డైరెక్టర్ ట్రావెల్ చేయించిన విధానం అద్భుతంగా ఉంటుంది.

  గల్లా అశోక్ మూవీ రద్దు కావడంపై

  గల్లా అశోక్ మూవీ రద్దు కావడంపై

  గల్లా అశోక్(మహేష్ బాబు మేనల్లుడు)తో ముందుగా అనుకున్న స్క్రిప్ట్ వర్కౌట్ కాదనిపించింది. అందుకే వేరే స్క్రిప్టు, వేరే డైరెక్టర్‌తో చూస్తున్నాం. రాజ్ తరుణ్ సినిమా కూడా మెటీరియలైజ్ అవుతుంది. మొత్తం మెటీరియలైజ్ అయ్యే వరకు నేను ఏదీ అఫీషియల్ గా చెప్పను.

  రెమ్యూనరేషన్ గురించి అప్పుడే చెప్పా

  రెమ్యూనరేషన్ గురించి అప్పుడే చెప్పా

  నాకు అనిల్ మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉెంది. ఆయన నాకు ఏదైనా కథ చెబితే నచ్చితే చేస్తాను. ‘ఎఫ్ 2' రిలీజ్ ముందు అతడి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఎంత ఇచ్చాను అనేది చెప్పలేను. త్వరలో ‘ఎఫ్ 3' చేయబోతున్నామని దిల్ రాజు తెలిపారు.

  English summary
  In a latest media interaction this afternoon, Dil Raju revealed that he is producing a film with Naga Chaitanya as the hero. A debutant will direct the film and the script has been locked already.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more