అరి మూవీ ఓ మోడరన్ భగవద్గీత.. హిమాలయాలకు వెళ్లి మునులు, యోగులను కలిసి.. డైరెక్టర్ జయశంకర్
భారతీయ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా రూపొందే సినిమా కథలకు ప్రస్తుతం సినీ ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్సందన లభిస్తున్నది. అలాంటి కథలతో ఇటీవల వచ్చిన చిత్రాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే భారతీయ పురాణాల్లో విశిష్టతను, ప్రాముఖ్యతను చెప్పే విధంగా దర్శకుడు జయశంకర్ భారీ ప్రయత్నాన్ని చేపట్టారు. ఇతిహాసాల మూలాలను శోధించి అరి సినిమాను రూపొందించారు.ఈ సినిమా వెనుక అతడి విజన్, ఆయన ఆలోచన ఏమిటి? ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే..
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డీ శేషురెడ్డి మారంరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. లింగ గుణపనేని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి My Name Is Nobody అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకొన్నది. ఈ సినిమా ప్రముఖ పంపిణీదారు ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో జయశంకర్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ...

బాల్యం నుంచే నాకు పురాణాలు, ఇతిహాసాలు అంటే అమితాసక్తి. వాటిపై పూర్తిగా అవగాహన కల్పించుకొనే ప్రయత్నం చేశాను. భారతీయ పురాణాల్లో అరిషడ్వర్గాలును జయించాలి అని పెద్దలు చెప్పారు. కానీ వాటిని ఎలా జయించాలో విడమరిచి చెప్పలేదు. ఆ కోణంలో ఆలోచిస్తున్న సమయంలో వచ్చిన ఐడియానే అరి సినిమాగా రూపొదిద్దుకొన్నది. ఈ సినిమా కథను రూపొందించడానికి వ్యయప్రయాసాలను అధిగమించాను. హిమాలయాలకు వెళ్లి కొందరు మునులను, యోగులను కలిశాను. అరిషడ్వార్గాల గురించి వారు వెల్లడించిన విషయాలు, సూచనల ద్వారా వాటిని జయించడం ఎలా అనే విషయాన్ని తెలుసుకొన్నాను అని జయశంకర్ తెలిపారు.
అరి సినిమా చాలా ఇంటెన్స్‌గా సాగే కథ. అలాగని డాక్యుమెంటరీగానో.. మరో విధంగా ఈ కథను చెప్పలేదు. సినిమాటిక్ ఫార్మూలాతో అన్ని విషయాలను రంగరించి వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమాను స్టార్ హీరోలతో చేస్తే బాగుంటుంది. కానీ స్టోరీని స్టార్స్ డామినేట్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కథ డిమాండ్ మేరకు ఆ పాత్రలకు సరిపోయే వారితోనే నిర్మించాం. వైవా హర్ష కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నాను. కమర్షియల్ పంథాలో సాగుతూ సందేశాన్ని అందిస్తుంది అని జయశంకర్ పేర్కొన్నారు.
అరి కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్ తో మూవీ రాలేదని అన్నారు. ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్‌లో క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చేశాం. అలాగే AI టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది, అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుంది అని అన్నారు.

అరి సినిమాను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ రచయితలు మల్లాది కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ చూసి అభినందించారు. అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది. పురాణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అని వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నాం. అశ్వనీదత్ గారు కూడా మా మూవీ చూసి అభినందించారు. మా మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో అరి రీమేక్ చేస్తా అని జయశంకర్ తెలిపారు.
అరి సినిమా యూత్ ఆడియెన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుందనే విషయాన్ని ఎవరూ ఊహించలేరు. తర్వాత ఏంటి అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ కు వెళ్తున్నాం అని జయశంకర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











