twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya తర్వాత ఎన్టీఆర్ నన్ను కిడ్నాప్ చేయడం ఖాయం.. కొరటాల శివ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

    |

    సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. ముహుర్తాలు, శుభ శకునాలు, సెంటిమెంట్లకు విపరీతంగా సెలబ్రిటీలు మొగ్గు చూపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకమైన సిట్యూయేషన్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఆచార్య రిలీజ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి ఇమేజ్‌, క్రేజ్‌కు తగినట్గుగా కమర్షియల్ అంశాలను జోడించి చేసిన చిత్రం. చిరంజీవితో మేము ప్రయోగాత్మక చిత్రం తీయలేదు అని కొరటాల శివ స్పష్టం చేశారు. ఇంకా కొరటాల శివ మాట్లాడుతూ..

    చిరంజీవికి కథ రాయడం కష్టం కాదు..

    చిరంజీవికి కథ రాయడం కష్టం కాదు..

    ఇండియన్ సినిమాలో చిరంజీవి మెగాస్టార్. ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. లెక్కలేనంతగా అభిమానులు ఉన్నారు. అందుకే చిరంజీవి లాంటి స్టార్ హీరోకు కథ రాయడం కష్టం కాదు. మెగాస్టార్‌కు కథ రాయడం తేలిక అని కొరటాల శివ అభిప్రాయపడ్డారు. అయితే ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత కొరటాల శివకు భారీగా చేదు అనుభవం ఎదురవుతున్నది. ఆచార్య చిత్రం తమ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    సోషల్ మీడియాకు దూరంగా

    సోషల్ మీడియాకు దూరంగా

    అయితే ఆచార్య సినిమా తొలి షో తర్వాత సోషల్ మీడియాలో బ్యాడ్ టాక్ రావడంతో కొరటాల సోషల్ మీడియా నుంచి తప్పుకొన్నారు. ట్విట్టర్ ఇతర అకౌంట్లను డీయాక్టివేట్ చేశారు. అంతేకాకుండా ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసుకొన్నారనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.

    అయితే మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన కొరటాల శివ.. ఆచార్య విషయంలో అంచనాలు ఎక్కడో తప్పాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గతంలో అద్బుతమైన చిత్రాలు తీసిన ఆయనేనా ఆచార్యను తీసిందనే మాట సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది.

    ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

    ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

    ఆచార్య తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనలో పడ్డారు. ఎన్టీఆర్ సినిమా కథ విషయంలో జాగ్రత్తలు వహించాల్సిందే అనే డిమాండ్‌ను ఆచార్య రిలీజ్ తర్వాత బలంగా వినిపిస్తున్నారు. కొందరైతే ఎన్టీఆర్‌తో సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

    ఎన్టీఆర్‌తో హై ఓల్టేజ్ సినిమా

    ఎన్టీఆర్‌తో హై ఓల్టేజ్ సినిమా

    ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమా గురించి కొరటాల శివ స్పందిస్తూ.. పాయింట్ లాక్ చేశాం. ఇంకా కథలో ఎలాంటి అంశాలు ఉండాలనే విషయంపై డిస్కషన్ జరుగలేదు. జనతా గ్యారేజ్ సమయంలోనే ఎన్టీఆర్, నేను మా సినిమా గురించి చర్చించుకొన్నాం. హై ఓల్టేజ్ ఉన్న పెద్ద కథను రాసుకొందామని అనుకొన్నాం. ఆ ప్రకారమే కథను డిసైడ్ చేస్తున్నాం అని కొరటాల ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    ఎన్టీఆర్‌తో సిట్టింగ్స్ వేస్తా

    ఎన్టీఆర్‌తో సిట్టింగ్స్ వేస్తా

    ఆచార్య ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ కథ గురించి ఇంకా ఆలోచించలేదు. డెఫినెట్‌గా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టే ఉంటుంది. ఆచార్య రిలీజ్ తర్వాత నన్ను కిడ్నాప్ చేస్తానని ఎన్టీఆర్ అంటున్నారు. ఆచార్య రిలీజ్ అనంతరం వారం రోజుల్లోగా ఎన్టీఆర్‌తో కలిసి కూర్చొంటాను. కథపై ఇద్దరం చర్చించి ఫైనల్‌గా ఒక అవగాహనకు వస్తాం అని కొరటాల శివ తెలిపారు.

    English summary
    Director Koratala Siva's Acharya movie getting mixed reviews. In this occasion, he made interesting comments Jr NTR and NTR30 movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X