For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Varudu Kavalenu పెళ్లి చేస్తే విడాకులు ఇస్తానని బెదిరించా.. సినిమానే నా జీవితం.. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య

  |

  యువ హీరో, హీరోయిన్లు నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం వరుడు కావలెను. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ..

   కర్నూలులో పుట్టి.. గుంటూరులో పెరిగా

  కర్నూలులో పుట్టి.. గుంటూరులో పెరిగా

  నేను పుట్టింది కర్నూలు జిల్లాలోని వెంకటాపురం అయినా పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసరావు పేట. మా నాన్న మ్యాథ్స్ లెక్చరర్. 11 ఏళ్లకే పదో తరగతి ఎగ్జామ్ రాశాను. చిన్నప్పుడు గేమ్స్ బాగా ఆడేదానిని. అయితే నన్ను ప్లేయర్ చేయాలని నాన్న అనుకొన్నారు. చిన్నప్పటి నుంచి గుంపులో కలిసిపోవడం కాకుండా నలుగురిలో ఒకరిలా ఉండటం ఇష్టం. రాజకీయాలు, గేమ్స్ గానీ, సినిమాలో రాణించాలని అనుకొన్నాను. అయితే డిగ్రీ చదువు ఆ తర్వాత చూద్దామని అన్నారు. అయితే పెళ్లి చేయడానికి ప్రయత్నించారు.. పెళ్లి చేస్తే విడాకులు ఇచ్చి వచ్చేస్తానని చెప్పాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నాకు కరెక్ట్ అనిపించింది. పద్దెనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చేశాను అని లక్ష్మీ సౌజన్య తెలిపారు.

  తేజ, శేఖర్ కమ్ముల, క్రిష్ వద్ద

  తేజ, శేఖర్ కమ్ముల, క్రిష్ వద్ద

  సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి దర్శకులు తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ఆర్కా మీడియా, క్రిష్ జాగర్లమూడి, ప్రకాష్ కోవెలమూడి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా వర్క్ చేశాను. 'వాంటెడ్' తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మొత్తానికి ఇండస్ట్రీలో 15 ఏళ్ల జర్నీ తర్వాత వరుడు కావలెను సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాను. సినిమా మేకింగ్‌లో ఏ దర్శకుడి ప్రభావం నాపై ఉండదు. నా అభురుచి మాత్రమే సినిమాలో కనిపిస్తుంది అని లక్ష్మీ సౌజన్య చెప్పారు.

   చినబాబుకు రుణపడి ఉంటా

  చినబాబుకు రుణపడి ఉంటా

  వరుడు కావలెను సినిమా విషయానికి వస్తే.. 2017లో నిర్మాత చినబాబుకి ఈ కథ చెప్పాను. స్టోరీ ఐడియాతోపాటు అరగంట పూర్తి నేరేషన్ ఇచ్చాను. నేను చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చడంతో సినిమా ప్రారంభమైంది. కరోనావైరస్ కారణంగా రెండేళ్లు ఆలస్యమైంది. హారిక హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో నా లాంటి కొత్త డైరెక్టర్‌కి అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నాను. చినబాబుకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రతీ విషయంలోను మంచిగా గైడ్ చేశారు అని లక్ష్మీ సౌజన్య అన్నారు.

  నా చుట్టూ ఉండే వ్యక్తుల జీవితం నుంచి

  నా చుట్టూ ఉండే వ్యక్తుల జీవితం నుంచి

  సమాజంలో నా చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాల నుంచే కథలు రాసుకుంటాను. వాస్తవ జీవితంలో ఆత్మగౌరవం ఎక్కువగా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్నాను. బేసిగ్గా నాలోనూ ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి అమ్మాయి ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో చాలా క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ నాగశౌర్యలో ఉన్నాయనిపించింది. ఫస్ట్ నుంచి హీరోగా నాగశౌర్యనే అనుకున్నాను. ఫస్ట్ మూవీతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకున్నాను అని లక్ష్మీ సౌజన్య తెలిపారు.

  వరుడు కావలెను ఎలా ఉంటుందంటే..

  వరుడు కావలెను ఎలా ఉంటుందంటే..

  వరుడు కావలెను సినిమా ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వడం లేదు. సినిమా చూస్తే అమ్మాయిలు బాగా ఇష్టపడుతారు. అబ్బాయిలు అమ్మాయిలను చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు. ఆడ,మగ అనే తేడా లేకుండా ఇద్దరు ఇష్టపడుతారు. ఇక ఈ సినిమాలో విశాల్ చంద్రశేఖర్ మంచి పాటలు ఇచ్చారు. జానపద పాటల కోసం తమన్‌తో వర్క్ చేశాం. దిగు దిగు నాగ పాట ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది అని లక్ష్మీ సౌజన్య పేర్కొన్నారు.

  Recommended Video

  Director Maruthi Launched 'Achamaina Telugu Inti Pillave' Song From Savitri w/o Satyamurthy
   నా నెక్ట్స్ సినిమా ఎప్పుడంటే..

  నా నెక్ట్స్ సినిమా ఎప్పుడంటే..

  వరుడు కావలెను తర్వాత వెంటనే సినిమాలు స్టార్ట్ చేయడం లేదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ స్క్రిప్టు రెడీ చేసుకొన్నాను. నా తదుపరి సినిమా ఆధార కార్డు చుట్టూ తిరిగే కథ. ఒక మనిషి గుర్తింపును చెప్పే మూలకథతో రాబోతున్నాను. భవిష్యత్‌లో కూడా మంచి సినిమాలు చేయాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనుకొంటున్నాను అని లక్షీ సౌజన్య అన్నారు.

  English summary
  Varudu Kavalenu' marks the directorial debut of Lakshmi Sowjanya. Starring Naga Shaurya and Ritu Varma in the lead roles. The film, presented by PDV Prasad and produced by Naga Vamsi Suryadevara under prestigious production house Sithara Entertainments, is all set for release on October 29th in theatres.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X